Telugu Gateway
Cinema

‘మార్తాండం’గా పృథ్వీ

‘మార్తాండం’గా పృథ్వీ
X

ఓ పుస్తకం చదివి 30 రోజుల్లో లాయర్ కావొచ్చా?. ఏమో టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ పృథ్వీ మాత్రం లాయర్ డ్రెస్ వేసుకుని ఓ పుస్తకం పట్టుకుని అదే చెబుతున్నారు. అదేంటి అంటే..30 రోజుల్లో లాయర్ అవటం ఎలా?. అదెలా సాధ్యం అంటారా?. అయితే ఇందులో విషయం ఏంటో తేలాలంటే మీరు ‘ మై డియర్ మార్తాండం’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు పృథ్వీ. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ లుక్ కూడా వెరైటీగా ఉంది.

పృథ్వీ మేనరిజమ్స్ చాలా సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. మరి ఈ మార్తాండం ఏమి చేస్తాడో వేచిచూడాల్సిందే. ఈ సినిమాను మజిన్ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తుండగా...హరీష్ కెవి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీ లాయర్ గా నటిస్తున్నారనే విషయం ఫస్ట్ లుక్ చెప్పేసింది. కోర్టు సీన్లలో పృథ్వీ ఏ మేరకు నవ్విస్తారో చూడాల్సి ఉంది.

Next Story
Share it