Telugu Gateway
Telangana

మోడీ..అసద్ ల మద్దతు కెసీఆర్ కే!

మోడీ..అసద్ ల మద్దతు కెసీఆర్ కే!
X

రాజకీయాలు అంటే విచిత్రంగా ఉంటాయి. బిజెపికి..ఎంఐఎంకు అసలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ అదేమి విచిత్రమో కానీ..అటు బిజెపి, ఇటు ఎంఐఎం కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కే మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం నాడు లోక్ సభ సాక్షిగా తెలంగాణ సీఎం కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం రాజకీయాలు చేస్తుంటే...తెలంగాణ సీఎం కెసీఆర్ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారని వ్యాఖ్యానించారు. దీని ద్వారా మోడీ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఓ వైపు రాష్ట్ర బిజెపి నాయకులు కెసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే..సాక్ష్యాత్తూ మోడీ లోక్ సభలో కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కు మద్దతు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ నేతలు తాజాగా ‘రివర్స్ గేర్’ వేసిన విషయం తెలిసిందే. అలా మద్దతు ఇస్తే మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అన్న ఉద్దేశంతో వీరు వెనక్కితగ్గినట్లు కన్పిస్తోంది.

టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు..అంతే కాదు ఓటింగ్ కు కూడా దూరంగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చ సమయంలో ఎంపీ వినోద్ ఏపీలో కలిపిన ఏడు మండలాలను వెనక్కి ఇచ్చేయాలనే కొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. పోనీ ఈ డిమాండ్ కోసం ఏమైనా టీఆర్ఎస్ గత కొంత కాలంగా ఏమైనా ఉద్యమాలు చేస్తుందా...కేంద్రంపై ఒత్తిడి చేస్తుందా? అంటే అదీ లేదు. స్వయంగా కెసీఆర్ మొదలుకుని..కవిత వరకూ పలుమార్లు ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించారు. కానీ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో మాత్రం ఏపీకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తే ఊరుకునేదిలేదని వినోద్ సభలో ప్రకటించారు. టీఆర్ఎస్, బిజెపిల స్నేహగీతం ఎప్పటినుంచో ఉన్నా...అవిశ్వాస తీర్మానం సమయంలో మరోసారి ఇది బహిర్గతం అయింది.

Next Story
Share it