Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్

ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్
X

అసలు ఈ బయోపిక్ లో కీర్తి సురేష్ కు ఏమి రోల్ ఇస్తారన్నదే కదా? మీ డౌట్. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో అదరగొట్టిన కీర్తిసురేష్ అచ్చు అదే పాత్రను ఎన్టీఆర్ లో చేయనున్నారట. సావిత్రి, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందుకే సావిత్రిగా జీవించిన కీర్తి సురేష్ ను ఈ సినిమాకు ఎంపిక చేశారంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా విన్పిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఎన్టీఆర్ బయోపిక్ లో కీర్తి సురేష్ ప్రవేశిస్తే అది ఈ సినిమాకు ఓ హైలెట్ గా నిలవటం ఖాయంగా చెప్పుకోవచ్చు. క్రిష్‌ దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రానా, సుమంత్‌లు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రను ఈ సినిమాలో బాలకృష్ణ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it