Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఇంటర్వ్యూ...తెరపైకి లోకేష్!

జగన్ ఇంటర్వ్యూ...తెరపైకి లోకేష్!
X

అదేంటి?. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ వస్తుంటే అందులో నారా లోకేష్ ఎలా వస్తారనుకుంటున్నారా?. అక్కడే ఉంది అసలు విషయం. ఓ ప్రముఖ ఛానల్ పాదయాత్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూకు సంబంధించి ప్రొమోలతో హడావుడి ..హంగామా చేసింది. ఈ మధ్య కాలంలో ఓ తెలుగు ఛానల్ కు అంత సమయం ఇచ్చి జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా అదే కావటంతో సహజంగానే దానిపై ఆసక్తి పెరిగింది. అక్కడే మీడియా మేనేజ్ మెంట్ లో ఎంతో సిద్ధహస్తులైన టీడీపీ నేతలు..పెద్దలు ఓ ప్లాన్ వేశారు. ప్రజలకు కావాల్సిన పని చేయటంలో పెద్ద పోటీ ఉండదు కానీ..ప్రతిపక్ష పార్టీ ఏదైనా కార్యక్రమం పెడితే దానికి మీడియాలో కవరేజ్ రాకుండా...ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టి..ఫస్ట్ పేజీల్లో ఫుల్ పేజీల యాడ్స్ ఇచ్చే సంస్కృతిని ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి ప్రవేశపెట్టింది చంద్రబాబునాయుడే. తర్వాత దాన్ని సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ కూడా ఫాలో అయ్యారనుకోండి.

ఇప్పుడు జగన్ ఇంటర్వ్యూ వస్తోంది. ఎలా అడ్డుకోవటం సాధ్యం కాదు . అంతే ఓ ప్రముఖ ఛానల్ లో మంత్రి నారా లోకేష్ ఇంటర్వ్వూ ప్లాన్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి..అందునా టీడీపీ లాంటి పార్టీకి అది సాధ్యం కాదనుకోవటం భ్రమే అవుతుంది ఎవరికైనా. అందుకే జగన్ ఇంటర్వ్యూ కు కౌంటర్ గా అన్నట్లు లోకేష్ ఇంటర్వ్యూను ఓ ఛానల్ లో ప్రసారం చేశారు. పోనీ అందులో ఏమైనా విషయం ఉందా? అంటే అది అంతా కామెడీతో నిండిపోయింది. ఎలా అంటారా?. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారట. ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాలతో కాదు..ప్రపంచంలో ఉన్న అగ్ర దేశాలతో పోటీపడతారంట. మీ ఇష్టం.. అసలే కష్టాల్లో ఉన్నారా?..కామెడీ కావాలంటే ఆ ఇంటర్వ్యూ చూసి నవ్వుకోండి.

Next Story
Share it