Telugu Gateway
Andhra Pradesh

జగన్ తప్పు మీద తప్పులు!

జగన్ తప్పు మీద తప్పులు!
X

వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తప్పు మీద తప్పులు చేస్తున్నారా?.అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అదెలాగో మీరూ చూడండి. అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం లోక్ సభలో ఉండి పోరాడితేనే మోడీ సర్కారు పట్టించుకోలేదు. కానీ ప్రత్యేక హోదా విషయంలో ‘క్రెడిట్’ దక్కించుకోవాలనే తపనతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ ఎంపీలతో రాజీనామా చేయించారు. ఎంపీల రాజీనామాలో జరిగిన విపరీత జాప్యం కూడా వైసీపీకి రావాల్సిన క్రెడిట్ రాకుండా చేశాయి. వైసీపీ ఎంపీల రాజీనామాలు..ఆమోదం ప్రజలు మర్చిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో లెక్కలేనన్ని సార్లు మాటమార్చిన చంద్రబాబు మాత్రం అన్ని పార్టీల నేతలకు లేఖలు రాస్తూ...తాము పెట్టే మోడీ సర్కారుపై పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలంటూ తన ఎంపీలతో హంగామా చేయించుతున్నారు. తప్పులు చేసిన చంద్రబాబే ఆ తప్పు అంతా మోడీదే అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే..తన ఎంపీలతో రాజీనామా చేయించిన వైసీపీ అధినేత జగన్ తీసుకున్న తాజా నిర్ణయం మాత్రం పార్టీ మాజీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అసలు ప్రత్యేక హోదా వల్ల ఏమీ రాదు..ప్యాకేజీనే బెటర్ అని వాదించిన టీడీపీ ఎంపీలు సభలో ఉండి..అవిశ్వాస తీర్మానం పెట్టి బిజెపిపై పోరాటం చేస్తున్నామని చెప్పుకోవటానికి రంగం సిద్ధం చేస్తుంటే...ఈ మధ్యే రాజీనామా చేసిన ఎంపీలు మాత్రం పార్లమెంట్ వెలుపల ధర్నాలు చేస్తారంట.

దీని వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది. ప్రచారం తప్ప?. నిజంగా ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసి...నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటే అది ఓ లెక్కగా ఉండేదని..కానీ ఓ సారి దీక్ష చేసి..తర్వాత పూర్తిగా వదిలేయటం వల్ల రాజకీయంగా కలగాల్సిన లాభం కలగపోవటం ఒకెత్తు అయితే..ఉన్న పదవులు కూడా పొగొట్టుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ మాజీ ఎంపీలే అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు అవసరమైన వందలాది అంశాలు పక్కన పెట్టి ..ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకొనే వరకూ తాము సమావేశాలకు రాబోం అని చెప్పటం ద్వారా జగన్ సాధించి ఏమిటి?. ఫిరాయింపుదారులు ఏకంగా మంత్రులు అయి ఎంజాయ్ చేస్తుంటే..గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా బయట తిరగాల్సి వస్తోంది. అంతే కాదు..సభను చంద్రబాబు కు ఏకపక్షంగా అనుమతి ఇఛ్చినట్లు అయిందనే విమర్శలు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు. ఇటు అసెంబ్లీ బహిష్కరణ; అటు ఎంపీల రాజీనామాలు అనే జగన్ నిర్ణయాలు రెండూ తప్పేనని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it