Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

‘ఇండిగో’ నుంచి 12 లక్షల చౌక సీట్లు

0

దేశంలోని ప్రముఖ చౌకధరల ఎయిర్ లైన్స్ లో ఒకటైన ‘ఇండిగో’ భారీ ఆఫర్ తో ముందుకొచ్చింది. ఏకంగా 12 లక్షల చౌక సీట్లను ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. తన 12వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది.  ఇండిగో సర్వీసులు ఉన్న అన్ని రూట్లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ మెగా సేల్ మంగళవారం నుంచి  నాలుగు రోజుల పాటు సాగనుంది. ఈ సేల్ లో టిక్కెట్ల ప్రారంభ ధర 1212 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టిక్కెట్లపై ప్రయాణాలు మాత్రం జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకూ చేయవచ్చని ఇండిగో ప్రకటించింది.

- Advertisement -

సహజంగా వర్షాకాలంలో ఎయిర్ లైన్స్ లో ఆక్యుపెన్సీ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. ఖాళీగా ఉండే సీట్లను భర్తీ చేసుకునేందుకు గాను ప్రతి ఎయిర్ లైన్స్ ఈ సీజన్ లో ఇలాంటి ప్రకటనలు చేస్తూనే ఉంటాయి. దీని ద్వారా ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకునే పనిలో పడతాయి. ఎస్ బిఐ క్రెడిట్ కార్డుతో బుక్ చేసుకునే వారికి క్యాష్ బ్యాక్ సౌకర్యం కూడా వర్తింపచేస్తున్నాయి. అయితే ఈ కొనుగోళ్లు 3000 రూపాయలు ఉండాలి. ఇప్పటికే స్పైస్ జెట్ తో పాటు ఇతర ఎయిర్ లైన్స్ కూడా ఈ తరహా ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.