Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

హైదరాబాద్ లో ఐకియా స్టోర్లు

0

ప్రపంచంలోనే పేరెన్నికగన్న గృహోపకరణాల సంస్థ ఐకియా హైదరాబాద్ లో తొలిస్టోర్ ను ఆగస్టు9న ప్రారంభించనుంది. అయితే భారత్ లోనే ఇది తొలి ఐకియా స్టోర్ కావటం విశేషం. వాస్తవానికి ఐకియా స్టోర్ జూలై 19న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..వినియోగదారులకు మరింత నాణ్యతాప్రమాణాలతో సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. తమ వినియోగదారులకు ఉత్తేజభరితమైన వాతావరణం ఏర్పాటు చేయటంతోపాటు..సురక్షితమైన సౌకర్యాలు అందించటమే తమ లక్ష్యం అని కంపెనీ తెలిపింది.

- Advertisement -

ఐకియా ఇండియా ద్వారా కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులు అందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తెలిపారు. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో తొలిస్టోర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన సహకారం మరవలేనిదని పేర్కొన్నారు. ఇప్పటికే ఐకియా తన ఉత్పత్తుల ప్రచార హోరును పెంచేసింది.

Leave A Reply

Your email address will not be published.