Telugu Gateway
Latest News

ఆరు నెలల్లో 6.84 కోట్ల మంది విమానయానం

ఆరు నెలల్లో 6.84 కోట్ల మంది విమానయానం
X

ఆరు నెలలు. 6.84 కోట్ల మంది. ఈ లెక్కలు ఏంటి అంటారా?. 2018 జనవరి-జూన్ నెలల మధ్య కాలంలో దేశీయ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించిన వారి సంఖ్య ఇది. గత ఏడాది ఇదే కాలం కంటే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల 21.95 శాతంగా ఉంది. 2017 జనవరి-జూన్ కాలంలో ఈ ప్రయాణికుల సంఖ్య 5.61 కోట్లు మాత్రమే. ప్రతి ఏటా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదల నమోదు అవుతూనే ఉంది. 2018 ఒక్క జూన్ నెలలోనే దేశీయ ఎయిర్ లైన్స్ ద్వారా 1.13 కోట్ల మంది ప్రయాణించారు. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే వారి సంఖ్య ఇందులో ఉండదు. దేశంలోని ప్రముఖ చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ 94.8 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో అగ్రస్థానంలో నిలిచింది.

మరో సంస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ కూడా తొంభై శాతం పైనే 91 శాతం ఆక్యుపెన్సీ రేషియో దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎయిర్ లైన్స్ ట్రూజెట్ ఆక్యుపెన్సీ రేషియోను క్రమక్రమంగా పెంచుకుంటోంది. అయితే జూన్ నెలలో ఈ సంస్థ సర్వీసుల రద్దు మాత్రం 2.29 శాతం ఉంది. సర్వీసులు ప్రారంభించిన చాలా రోజుల పాటు ఈ ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. 2018 జూన్ నెలలో కేవలం0.20 శాతం సర్వీసుల రద్దుతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉంది. దేశంలోని పలు రాష్ట్రాలకు..పర్యాటక ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటి పెరిగితే దేశీయ విమానయాన రంగంలో వృద్ధి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టి ఉడాన్ స్కీమ్ కూడా వియానయాన రంగం ప్రగతికి దోహదం చేయనుంది.

Next Story
Share it