Telugu Gateway
Andhra Pradesh

బిగ్ బ్రేకింగ్...‘సర్వ దోపిడీ అభియాన్’..గంటా శాఖ బిగ్ స్కామ్ కు ‘ఈనాడు’ షుగర్ కోటింగ్!

బిగ్ బ్రేకింగ్...‘సర్వ దోపిడీ అభియాన్’..గంటా శాఖ బిగ్ స్కామ్ కు ‘ఈనాడు’ షుగర్ కోటింగ్!
X

అది ఓ పెద్ద స్కామ్. కానీ స్కామ్ ను బయటపెట్టాల్సిన వారే దానికి ‘షుగర్’ కోటింగ్ వేశారు. అద్భుతమైన పథకంగా తెరపైకి తెచ్చారు. ‘పాఠశాలలకు మౌలిక కళ’ అంటూ అసలు విద్యా శాఖ ఎంతో మంచి పనిచేయబోతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. కానీ వాస్తవాలు చూస్తే కళ్ళు తిరిగిపోయేలా ఉన్నాయి. ప్రధాన పత్రికలు స్కామ్ లు ఎలాగూ బయటపెట్టడం లేదు...కానీ స్కామ్ లను కూడా ఇలా ప్రచారం చేయటం ఏమిటి? అని ఆ శాఖ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. 4848 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల్లో సుమారు 1500 కోట్ల రూపాయలపైనే స్కామ్ జరిగే అవకాశం ఉందని ఆ శాఖలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. ఇందులో సీఎం పేషీలోని ఓ ఉన్నతాధికారికి కూడా సంబంధం ఉందని చెబుతున్నారు. అంతే కాదు..మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి చంద్రబాబుల మధ్య విభేదాలు పెరగటానికి ఈ పనులు కూడా ఓ కారణం అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ లో చేపట్టే ఈ పనుల్లో భారీ ఎత్తున అక్రమాలకు గంటా అండ్ కో స్కెచ్ వేసిందని..అయితే వీటికి సీఎం చంద్రబాబు తొలుత బ్రేక్ వేసినట్లు చెబుతున్నారు.

కానీ తాజాగా జరిగిన రాజీ బాటలో భాగంగా వీటికి ఆమోదించారా? అన్న అనుమానాలు ఆ శాఖ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. సర్వశిక్ష అభియాన్ కింద ఈ ఫనులు చేపడుతున్నారు. ఏపీలో అన్ని పాఠశాలల్లో మరుగుదోడ్లు నిర్మించినట్లు ఏపీ సర్కారు కేంద్రానికి నివేదిక ఇఛ్చింది. కానీ ఇఫ్పుడు కొత్తగా ఈ పథకంలో 20,808 పాఠశాలల్లో మరుగు దొడ్లు నిర్మించనున్నట్లు చూపిస్తోంది. మరి ముందు ఇచ్చిన లెక్కతప్పా?. లేక ఈ లెక్క తప్పా?. ముందు ఇఛ్చిన లెక్క నిజం అయితే ఏకంగా 20,808 మరుగుదొడ్ల నిధులు నొక్కేయటానికి ప్లాన్ వేసినట్లే అని నిర్ధారించుకోవచ్చు. స్వచ్చ విద్యాలయ్ కింద అన్ని జిల్లాల్లోని స్కూళ్లలో టాయిలెట్స్ నిర్మించినట్లు సర్కారు అధికారికంగా ప్రకటించింది. మరి కొత్తగా ఎక్కడ...ఎలా నిర్మిస్తారు?.కొత్తగా 410 చోట్ల పాఠశాల భవనాలు నిర్మించటానికి టెండర్లు పిలిచారు. కానీ కొన్ని చోట్ల అసలు స్థలం గుర్తింపే పూర్తి కాలేదు. అలాంటిది మరి టెండర్లు పిలిచి..కాంట్రాక్టర్లకు డబ్బులిచ్చి కూర్చుంటారా? ఇప్పటి వరకూ ఏపీలోనని 3629 పాఠశాలల్లో అసలు తాగునీటి సదుపాయమే లేదని సర్వశిక్షా అభియాన్ లెక్కలు చెబుతోంది. అంటే ఇంత కాలం మరి పిల్లలు ఎలా పాఠశాల్లో ఉన్నారు?.

ఓ వైపు ఏపీని సింగపూర్, జపాన్ చేస్తామని చంద్రబాబు చెబుతుంటే..మరి సర్వశిక్షా అభియాన్ లెక్కల్లో మాత్రం 20,808 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 3629 స్కూళ్ళలో తాగునీటి సదుపాయాలు లేవని చెబుతోంది. అంతే కాదు..ఏకంగా 2550 స్కూళ్ళలో అసలు విద్యుత్ సదుపాయమే లేదని చెబుతున్నారు. కానీ పలు పాఠశాలల్లో ‘డిజిటల్ క్లాసులు’ అమల్లో ఉన్నాయని చెబుతారు.. ఫర్నీచర్ కొనుగోలు, ప్రహరీలు, బయో ఫెన్సింగ్ వంటివి భారీ ఎత్తున సర్వశిక్షా అభియాన్ నిధుల దోపిడీకీ ఓ మార్గంగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద ఇచ్చే పనుల్లో తొలి దశలో 40 శాతం నిధులను కాంట్రాక్ట్ సంస్థలకు కేటాయిస్తారు. అందులో నుంచే ఎవరి కమిషన్లు వారు తీసుకుని...ఎంచక్కా ఉడాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని..ఎక్కడా తమకు ఇబ్బంది రాకుండా ఉండేందుకే మౌలిక కళ స్టోరీ ప్లాంట్ చేయిచారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాస్ కూడా ఇందులో కీలకపాత్ర పోషించినట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. యూపీ నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన ఆయన ఎస్ఎస్ఏలోనే జాయిన్ అయ్యేందుకు ఆరు నెలలు ఎదురుచూసినట్లు చెబుతున్నారు.

Next Story
Share it