Telugu Gateway
Cinema

పోలీస్ స్టేషన్ లో పెళ్ళిచూపులు

పోలీస్ స్టేషన్ లో పెళ్ళిచూపులు
X

పెళ్లిచూపులు ఎవరికైనా పోలీస్ స్టేషన్ లో జరుగుతాయా?. ఏమో చి...ల...సౌ సినిమాలో మాత్రం అలాగే జరిగినట్లు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ శనివారం నాడు విడుదల అయింది. ఇందులో పలు ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి. హీరో హైదరాబాద్ లో రెండు రకాల అమ్మాయిలు ఉంటారు అని చెపితే..హీరోయిన్ మాత్రం హైదరాబాద్ లో హ్యాండ్సమ్ అబ్బాయిలను ఏమంటారో తెలుసా? అంటూ కౌంటర్ ఇస్తుంది. ఈ సినిమాలో సుశాంత్ హీరోగా నటిస్తుండగా..హీరోయిన్ గా రుహానీ శర్మ చేస్తున్నారు.

ఈ సినిమాకు ట్రైలర్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. పెళ్ళికి సంబంధించి సరదా సన్నివేశాలతో...వెన్నెల కిషోర్ కామెడీ పంచ్ లతో ఇది సరదాగా సాగిపోతోంది. పెళ్లికి సంబంధించి హీరో..హీరో తల్లి మధ్య జరిగే సంభాషనలు అయితే హాయిగా నవ్విస్తాయి. ఈ సినిమా ఆగస్టు3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

https://www.youtube.com/watch?v=02XMyxyY3AI

Next Story
Share it