Telugu Gateway
Telangana

జపాన్ పాస్ పోర్టు పవర్ ఫుల్...భారత్ ర్యాంకు 76

జపాన్ పాస్ పోర్టు పవర్ ఫుల్...భారత్ ర్యాంకు 76
X

ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టు ఏదో తెలుసా?. అది జపాన్ పాస్ పోర్టు. ఎందుకంటే ఈ పాస్ పోర్టుతో ఏకంగా ప్రపంచంలోని 189 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చన్న మాట. అంత పవర్ ఉంది ఈ పాస్ పోర్టుకు మరి. అందుకే ప్రపంచంలోనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది. 188 దేశాలకు వీసాలు లేకుండా పోయే అవకాశం ఉన్న సింగపూర్, జర్మనీ దేశాల పాస్ పోర్టులు రెండవ స్థానాన్ని దక్కించుకున్నాయి. నార్వే, బ్రిటన్, ఆస్ట్రియా, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, అమెరికా లు 186 దేశాల యాక్సెస్ తో నాల్గవ స్థానాన్ని దక్కించుకన్నాయి ఈ జాబితాలో భారత్ 76వ స్థానంలో ఉంది. భారత్ పాస్ పోర్టు కలిగిన వారు కేవలం 59 దేశాల్లో మాత్రమే వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా ఈ జాబితాలో మార్పులు ఉంటాయి.

అయితే భారత్ మాత్రం ఎప్పుడూ టాప్ టెన్ కాదు..కదా..కనీసం టాప్ 50 జాబితాలో చోటు దక్కించుకోలేదు. హెన్లీ అండ్ పార్టనర్స్ వార్షిక పాస్ పోర్టు నివేదిక ఈ వివరాలను బహిర్గతం చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అథారిటీ దగ్గర అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. వీసా విధానాల్లో జరిగే మార్పులకు అనుగుణంగా ఎఫ్పటికప్పుడు ఈ జాబితాలో మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. బెల్జియం, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, కెనడా దేశాల పాస్ పోర్టులతో 182 దేశాల్లో సంచరించవచ్చు. ఈ పాస్ పోర్టులకు ఈ జాబితాలో ఐదవ ర్యాంకు దక్కింది. ఆస్ట్రేలియా, గ్రీస్ ఆరవ ప్లేస్ లో ఉండగా, న్యూజిలాండ్, జెక్ రిపబ్లిక్, మాల్టాలు ఏడవ ప్లేస్ లో, ఐస్ ల్యాండ్ 8వ ప్లేస్ లో ఉన్నాయి.

Next Story
Share it