Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మళ్ళీ శ్రీరెడ్డి టార్గెట్ అయిన ‘నాని’

0

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం అంటూ సంచలనాలకు వేదికగా మారిన శ్రీరెడ్డి మరోసారి న్యాచురల్ స్టార్ నానిని టార్గెట్ చేసింది. గతంలో ఓ సారి కూడా సామాజిక మాధ్యమాల వేదికగా పేరు పెట్టకుండానే నానిపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా డైరక్ట్ ఎటాక్ చేసింది. నాని త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ షోను హోస్ట్ చేయనున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్డీఆర్ ఈ షోను హోస్ట్ చేసి సూపర్ సక్సెస్ సాధించగా..ఇప్పుడు నాని వంతు వచ్చింది. అయితే ఈ షోలో శ్రీరెడ్డి కూడా ఉంటుందని కొంత ప్రచారం జరిగింది.

అయితే అలాంటి వారు ఉంటే తాను షో కూడా చేయనని నాని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. మరి ఆ కోపమో…ఏమో కానీ శ్రీరెడ్డి మాత్రం మరోసారి నానిపై తీవ్ర విమర్శలు చేసింది.  ‘‘నానితో నేను కలిస్తే ఇక డర్టీ పిక్చరే! కానీ ఎప్పుడు? అతిత్వరలోనే.. మీ ముందుకు రాబోతున్నది. నాని రాసలీలలు అన్నీ బయటపెడతా. నాని కాపురంలో ఇక నిప్పులే..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు. అయితే ఇది కేవలం పబ్లిసిటీ స్టెంటా? లేక నిజమా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు.

 

Leave A Reply

Your email address will not be published.