Telugu Gateway
Andhra Pradesh

క్లారిటీ ఇఛ్చేసిన వైసీపీ

క్లారిటీ ఇఛ్చేసిన వైసీపీ
X

ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఓ విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం వైసీపీ, బిజెపి ఒకటే ..ఒకటే అంటూ ఊదరగొట్టేస్తున్నారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని తమకు బిజెపితో ఎలాంటి పొత్తు ఉండబోదని వైసీపీ సీనియర్ నేత బొత్స ప్రకటించారు. ఒక్క బొత్స సత్యనారాయణే కాదు...పార్టీ ఎంపీ వై వీ సుబ్బారెడ్డి కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కావాలనే చంద్రబాబు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని...తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. బొత్స శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు ఏపీకి నష్టం కలింగిచాయన్నారు. ఇప్పుడేమో బీజేపీతో వైఎస్సార్‌ సీపీకి సంబంధాలున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అదే సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స. సీఎం చంద్రబాబు నాయుడు దోపిడీని పుస్తక రూపంలో తెచ్చి, దేశంలో అన్ని పార్టీల నేతలకు అందజేస్తామన్నారు. టీడీపీలా ట్యాంపరింగ్‌ చేసుకునే సంస్కృతి తమకు లేదని, బహిరంగంగానే ప్రజల ముందుకు వస్తామని, అన్ని విషయాలు చెబుతామన్నారు.

టీడీపీ నేతలు రాంమాధవ్‌ ఇంటికి వెళ్లింది నిజమా..? కాదా అని ప్రశ్నించారు. ఢిల్లీకి బుగ్గన రాజేంద్రప్రసాధ్‌ వెళితే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ సీఎం పక్కనే ఉంటారని, మహారాష్ట్రకు చెందిన మంత్రి భార్య టీటీడీలో మెంబర్‌గా అవకాశమిస్తారని, ఎవరు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారో ప్రజలకు తెలుస్తోందన్నారు. లాలూచీ రాజకీయాలు చేస్తూ తమ పార్టీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అధికారం ఇచ్చింది ఐదేళ్లు దోపిడీ చేయడానికా అని ప్రశ్నించారు. చంద్రబాబు చాకచక్యంగా మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో అమర్‌ సింగ్‌ను చంద్రబాబు కలిసింది నిజమా కాదా అని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ రామారావును ఎందుకు కలిశారో చంద్రబాబు చెప్పాలని బొత్స డిమాండ్‌ చేశారు. చంద్రబాబు పరిపాలన గాలికొదిలేశారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తామ పార్టీ సిద్దంగా ఉందన్నారు. ప్రజలంతా ఎప్పుడు టీడీపీకి బద్దిచెప్పాలా అని ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Next Story
Share it