Telugu Gateway
Andhra Pradesh

ఆశీర్వదించమంటున్న బాబు...అక్కర్లేదంటున్న ప్రజలు

ఆశీర్వదించమంటున్న బాబు...అక్కర్లేదంటున్న ప్రజలు
X

‘నేను వస్తేనే అభివృద్ధి. మళ్ళీ నేను గెలిస్తేనే అమరావతి సింగపూర్ అయ్యేది. ఎమ్మెల్యేలపై కోపం నాపై చూపొద్దు. అన్ని విషయాలు మర్చిపోండి. మళ్ళీ నన్నే గెలిపించండి’ ఇదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పిలుపు. ప్రభుత్వ అవినీతి అయినా..ఎమ్మెల్యేల అవినీతి అయినా ఎన్నికల సమయంలో గుర్తుపెట్టుకోకుండా తనకు ఓటు వేయటం చారిత్రక అవసరం అని చంద్రబాబు గత కొంత కాలంగా ప్రజలకు నూరిపోస్తున్నారు. నవనిర్మాణదీక్షలు అంటూ రోజూ పత్రికలకు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇఛ్చుకుంటూ టీడీపీ ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు కోరుకుంటున్నది ఒకటి అయితే ప్రజలు తలస్తున్నది మరొకటిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏ మాత్రం గెలిచే ఛాన్స్ లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ నకు చెందిన తెలుగు వెబ్ సైట్ ‘సమయం’ ప్రజాభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో బాబు గెలుపునకు ఛాన్సేలేదని తెలుస్తోంది.

చంద్రబాబు నిత్యం తనకు తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకుంటుంటే...ప్రజలు మాత్రం చంద్రబాబు అనుభవం ఏపీకి ఏ మాత్రం ఉపయోగపడలేదని తేల్చిచెప్పారు. అచ్చం పవన్ కళ్యాణ్ లైన్ లోనే. ఏతా వాతా అది ఉపయోగపడి ఉంటే..చంద్రబాబు స్కామ్ లకు అక్కరకు వచ్చి ఉండొచ్చు. ఏపీలో చంద్రబాబు పాలన నాలుగేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమయం వెబ్ సైట్ ఈ అభిప్రాయ సేకరణ చేసింది. ఈ వివరాలు తెలుగుదేశం పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఈ ఓపీనియన్ పోల్ లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. చంద్రబాబు నాలుగు సంవత్సరాల పాలనపై ఏపీలోని ప్రజలు 57 శాతంపైగా నిరాశ వ్యక్తం చేశారు. 42.70 శాతం మాత్రమే బాబు పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. అందులోనూ కేవలం 16 శాతం మంది సూపర్ అన్నవారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి చంద్రబాబు అనుభవం ఏ మాత్రం ఉపయోగపడలేదని 58.30 శాతం ప్రజలు తేల్చిచెప్పారు. 33.18 శాతం మాత్రం బాబు అనుభవం పనికొచ్చిందని అంటున్నారు. ఈ క్షణాన ఎన్నికలు జరిగే ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించగా..42 శాతం మంది జగన్ కు అని చెప్పగా...చంద్రబాబుకు 30.85 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు ఏకంగా 19.35 శాతం రావటం విశేషం. 7.8 శాతం మంది ఇతరులకు అని చెప్పారు. ఈ సమయంలో జగన్ కు, చంద్రబాబుకు ఓట్ల తేడా శాతం 11 శాతం పైన ఉండటం విశేషం.

ఈ ఓపీనియన్ పోల్ ప్రకారం చూస్తే పీఆర్పీ కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఈ అభిప్రాయ సేకరణలో బిజెపితో పొత్తు తెంచుకోవటం మంచిదని 41.39 శాతం చెప్పగా...35.15 శాతం పెద్ద లాభదాయకం కాదన్నారు. మిగిలిన వారు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇందులో తేలిన మరో సంచలన విషయం ఏమిటంటే ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో లోకేష్ జోక్యం విపరీతంగా పెరిగిందని 67.89 శాతం మంది చెప్పటం విశేషం. 17 శాతం మంది మాత్రమే లోకేష్ జోక్యం లేదని నమ్ముతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవటమే కాకుండా..వారికి మంత్రి పదవులు ఇవ్వటంపైనా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది ఈ ఓపీనియన్ పోల్ లో. అదే సమయంలో ఏపీలో అవినీతి 64.50 శాతం పెరిగిందని చెప్పగా..సుమారు 20 శాతం మంది మాత్రం అవినీతి పెరగలదేన్నారు. ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలమయ్యారని ఎక్కువ మంది తేల్చారు. ఓవరాల్ గా చూస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రమాద ఘంటికలు మోగటం ఖాయంగా కన్పిస్తోంది.

Next Story
Share it