Telugu Gateway
Telangana

‘కొత్త మలుపు’ తిరిగిన నాని...శ్రీరెడ్డి ఎపిసోడ్

‘కొత్త మలుపు’ తిరిగిన నాని...శ్రీరెడ్డి ఎపిసోడ్
X

అడపా..దడపా సామాజిక మాధ్యమాల్లో కన్పించటం తప్ప..ఈ మధ్య కాలంలో శ్రీరెడ్డి చాలా వరకూ సైలెంట్ అయిపోయారు. కానీ బిగ్ బాస్2 లో తనకు ఛాన్స్ రాలేదనే కోపమో..మరో కారణమో తెలియదు కానీ....ఈ మధ్య కాలంలో హీరో నానిని టార్గెట్ చేశారు. అంతే కాదు..నాని తనతో గడిపాడంటూ తీవ్ర అభ్యంతర పదజాలంతో పోస్టింగ్ చేయటంతో ..అది పెద్ద సంచలనంగా మారింది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా శ్రీరెడ్డిని తమ షోకు పరిశీలించామని..అయితే అలా పరిశీలించిన వారిని అందరినీ తీసుకోవటం సాధ్యం కాదని వివరణ ఇఛ్చింది. అయితే నాని కారణంగానే తనకు ఛాన్స్ మిస్ అయిందనే భావనలో శ్రీరెడ్డి ఉన్నారు. నాని వ్యవహారంతో సడన్ గా శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. శ్రీరెడ్డి విమర్శలకు నాని లీగల్ నోటీసులు పంపటంతో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. లీగల్ నోటీసులపైనా శ్రీరెడ్డి రియాక్ట్ అయ్యారు. బాధిత మహిళలు ఏడుస్తూ కూర్చోవటం కాకుండా ఎలా పోరాడాలో తాను చేసి చూపిస్తానని పేర్కొన్నారు. నాని, తన మధ్య ఏమి జరిగిందో నాని అంతరాత్మకు అయితే తెలుసు కదా?.

అన్ని విషయాలు మీ అవిడతో చెబుతానంటున్నావు..మరి మనం విషయం కూడా చెప్పావా? అంటూ ఓ వీడియోను శ్రీరెడ్డి పోస్ట్ చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా వేరే ప్రాంతానికి వెళ్తుంటే లీగల్ నోటీసులు విషయం తెలిసిందన్నారు. తనకు కావాల్సింది కూడా ఇదేనని.. నీ రంకు బాగోతం బయటపెట్టడానికి ఓ మంచి అవకాశం తనకు వచ్చిందని నానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా ఫైట్‌ చేద్దాం.. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి వస్తాను.. అప్పుడు నాని సంగతి చూస్తానని తెలిపారు. ఇక నానిపై చేసే పోరాటం చూసి మిగతా వారందరూ వణికిపోయేలా చేస్తానని ఛాలెంజ్‌ విసిరారు. నువ్వు నిజంగా తప్పు చేసి ఉంటే.. ధర్మానికి నిజంగా బలం ఉంటే.. నువ్వు కచ్చితంగా దోరుకుతావని, దేవుడు నిన్ను శిక్షిస్తాడన్నాడని అన్నారు.

Next Story
Share it