Telugu Gateway
Andhra Pradesh

కుంభకోణాలకు ‘కుటుంబరావు’ టీజర్లు

కుంభకోణాలకు ‘కుటుంబరావు’ టీజర్లు
X

‘ ఏ పార్టీ దగ్గర అయినా..ఏ పత్రిక దగ్గర అయినా కుంభకోణాల వివరాలు ఉంటే వెంటనే బహిర్గతం చేసి సంచలనం సృష్టిస్తాయి. పక్కా ఆధారాలు వచ్చే వరకూ వేచిచూసి వాటిని అప్పుడే బయటపెడతారు. పార్టీలు అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పనిచేస్తాయి. పత్రికలు అయితే అది వాటి బాధ్యత. అయితే ఏపీలో ప్రస్తుతం ఆ పని పత్రికలు పూర్తిగా వదేలేశాయి. అది వేరే విషయం. ఇప్పుడు కుటుంబరావు వ్యవహారం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో విచిత్రంగా మారింది. ఆధారాలు ఉంటే బయట పెట్టకుండా...మా దగ్గర ఓ రెండు పెద్ద కుంభకోణాల వివరాలు ఉన్నాయి. రెండు నెలల్లో బయటకు చెబుతాం. అప్పుడు ప్రకంపనలు వస్తాయి’ అని ఎవరైనా ప్రకటించారనుకుంటే అది ఖచ్చితంగా తేడా కేసుగానే పరిగణించాలి. ఆ పని పత్రికలు చేసినా..పార్టీలు చేసినా ప్రత్యర్థులతో ‘బేరాల’ కోసం చేస్తారే తప్ప..వేరే కారణం ఉండదు. కుంభకోణాలు బహిర్గతం చేసేవారు గుట్టుచప్పుడు కాకుండా పని పూర్తి చేసి ఒకేసారి వివరాలు బహిర్గతం చేసి ‘సంచలనాల’కు కేంద్రం అవుతారు. కానీ ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఏంటో సినిమాకు ‘టీజర్’లాగా రెండు నెలల్లో భూమిని బద్దలు చేస్తాం అంటూ ప్రకటించి ఓ కొత్త కోణానికి తెరతీశారు.

ఎవరైనా ముందే మేం కుంభకోణాలు బహిర్గతం చేస్తాం అంటే..మా కుంభకోణాలను బహిర్గతం చేస్తే మీ కుంభకోణాలను కూడా బయట పెడతాం అని బిజెపిని బెదిరిస్తున్నారా?. ఇఫ్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సారధ్యంలోని ప్రభుత్వంలో కుంభకోణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాత్ర కూడా చాలా ఉందని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సింగపూర్ సంస్థల స్విస్ ఛాలెంజ్ వ్యవహారం మొదలుకుని..పలు వ్యవహారాల్లో కుటుంబ రావు జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుటుంబరావు పేరుకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అయినా ఆ పని సంగతి పూర్తిగా వదిలేసి...ఎక్కువ శాతం చంద్రబాబు స్కామ్ లకు సాయం చేస్తున్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అందుకే అర్హత లేకపోయినా ఆయన్ను కొన్నిసార్లు మంత్రివర్గ సమావేశాల్లోనూ కూర్చోపెట్టిన విషయం తెలిసిందే. కుటుంబరావు వైఖరి ఎలా ఉంది అంటే..చంద్రబాబు కుంభకోణాలపై కేంద్రం ముందుకు వెళితే మేం కూడా వాటిని బహిర్గతం చేస్తాం. అదీ రెండు నెలల్లో అని చెప్పినట్లు ఉందని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఎవరూ ఇలా కుంభకోణాలకు టీజర్లు ఇఛ్చిన చరిత్ర లేదని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it