Telugu Gateway
Movie reviews

‘కాలా’ మూవీ రివ్యూ

‘కాలా’ మూవీ రివ్యూ
X

ఒకప్పుడు రజనీకాంత్ సినిమా అంటే ఆ క్రేజ్ వేరు. థియేటర్ల దగ్గర సందడే సందడి. అంతా ఆ సినిమా వైపు ఆసక్తిగా చూసేవారు. కానీ కొద్ది రోజుల నుంచి రజనీకాంత్ క్రేజ్ క్రమంగా క్రమంగా తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం రజనీ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడమే. ఎంతో హైప్ క్రియేట్ చేసిన కబాలీ కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ తరుణంలో పలు వాయిదాల మీద వాయిదా పడుతూ వచ్చిన కాలా సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబాలి బాక్సాఫీస్ వద్ద దెబ్బతిన్నా రజనీకాంత్ మరోసారి పా.రంజిత్‌ కే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ముంబై మురికి వాడల నేపథ్యంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన సినిమానే ఈ కాలా. కాలా (రజనీకాంత్‌) ముంబైలోని మురికివాడ ధారావీకి పెద్ద దిక్కుగా ఉంటాడు. ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంటాడు. అయితే ముంబైలో అత్యంత విలువైన ఈ ప్రాంతాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు రాజకీయనాయకులు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ‍్యంగా అధికార పార్టీ నాయకుడు హరిదేవ్‌ (నానా పటేకర్‌) ఎలాగైన ధారావీని నుంచి ప్రజలను పంపేసి అక్కడ అపార్ట్‌ మెంట్లు నిర్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కాలా హరిదాదా పనులకు అడ్డుతగులుతాడు.

హరిదాదా, కాలాల మధ్య మొదలైన యుద్ధమే ఈ సినిమా. సహజంగానే ఈ సినిమాలో రజనీకాంత్‌ తనదైన స్టైల్స్‌, మేనరిజమ్స్‌ తో మరోసారి ఆకట్టుకున్నాడు. నటన పరంగా సూపర్బ్‌ అనిపించిన రజనీ యాక్షన్‌ సీన్స్‌ లో కష్టపడినట్లు కన్పిస్తుంది. విలన్‌ గా నానా పటేకర్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా.. ఉన్నంతలో సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది ఈ క్యారెక్టర్ . రజనీ ఇమేజ్‌ను ఢీ కొట్టే పొలిటీషియన్‌ పాత్రలో నానా పటేకర్‌ నటన సినిమాకు ప్లస్‌ అయ్యింది. రజనీ, ఈశ్వరీ రావ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను నివ్విస్తాయి. కీలక పాత్రలో నటించిన హూమా ఖురేషీ ఆకట్టుకుంది. రజనీ నుంచే అభిమానులు ఆశించే మాస్, కమర్షియల్ అంశాలేవీ లేకుండా సినిమాను రూపొందించిన రంజిత్‌ పూర్తిగా నిరాశపరిచాడు. రజనీ ఎంట్రీ విషయంలో కూడా పెద్దగా హడావిడి లేకుండా సాదాసీదాగా కాలా పాత్రను పరిచయం చేశాడు. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్‌ కూడా అక్కడక్కడా మెప్పించినా..చాలా సందర్భాల్లో విసిగించాడు. మురళీ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ధారావి మురికి వాడలను నేచురల్‌ గా చూపించాడు. ఓవరాల్ గా చూస్తే కాలా ప్రేక్షకులను ఆకట్టుకోవటం కష్టమే.

రేటింగ్. 2.25/5

Next Story
Share it