Telugu Gateway
Cinema

‘జంబలకిడి పంబ’ మూవీ రివ్యూ

‘జంబలకిడి పంబ’ మూవీ రివ్యూ
X

ఈ టైటిల్ పేరు వినగానే ఎవరికైనా ఈవీవీ సినిమా గుర్తుకు రావాల్సిందే. ఎందుకంటే అప్పట్లో ఈ సినిమా అంత సంచలనం సృష్టించింది. కొత్త సినిమాకు క్రేజ్ తెచ్చుకోవటానికి చిత్ర యూనిట్ అదే పాత ‘టైటిల్’ను వాడుకుంది. అంతే కాదు..అమ్మాయిలు అబ్బాయిలుగా యాక్ట్ చేయటం..అబ్బాయిలు అమ్మాయిలుగా యాక్ట్ చేయటం. ఆ పాత్రల్లోకి ప్రవేశించటం. అయితే ఈ ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు. దర్శకుడు మురళీకృష్ణ సినిమాను ఆసక్తికరంగా మలచటంలో విఫలమయ్యారు. హీరోగా నటించిన శ్రీనిసవారెడ్డి, హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధి ఇద్నానీ తమ పాత్రలకు ఓకే అన్పించినా సినిమా కథలో దమ్ములేకపోవటంతో వ్యవహారం తేలిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొద్ది రోజులకే విభేదాలతో విడాకులకు రెడీ అవుతారు. దీని కోసం విడాకులు ఇఫ్పించటంలో స్పెషలిస్టు అయిన లాయర్ గా నటించిన పోసానిని సంప్రదిస్తారు. అప్పటికే 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్‌ లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్‌ గా గిన్నిస్‌ రికార్డ్ సాధించాలనుకుంటాడు.

అదే సమయంలో వరుణ్‌, పల్లవికి విడాకులు రాకముందే హరిశ్చంద్ర ప్రసాద్‌ ఓ యాక్సిడెంట్‌లో భార్యతో సహా చనిపోతాడు. భూలోకం చేసిన పాపాల కారణంగా ఆత్మగా మారిన హరిశ్చంద్ర ప్రసాద్ భార్యకు దూరమవుతాడు. తిరిగి తన భార్యను కలుసుకోవాలంటే విడిపోయిన హీరో, హీరోయిన్లను కలపాలనే నిబంధన పెడతాడు దేవుడు. దీంతో తిరిగి భూలోకంలోకి వచ్చిన హరిశ్చంద్రప్రసాద్‌ ఏం చేశాడు..? వరుణ్‌ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి శరీరంలోకి వరుణ్‌ ఆత్మని ఎందుకు మార్చాల్సి వచ్చింది..? చివరకు వరుణ్‌, పల్లవిలు ఒక్కటయ్యారా..? లేదా..? అన్నదే సినిమా. సినిమాలో అక్కడక్కడ కామెడీ ఉన్నా..అది ఏ మాత్రం సినిమాను రక్షించలేదు. హీరోయిన్‌గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని మంచి నటనతో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా చూస్తే జంబలకిడిపంబ జోలికి వెళ్ళకపోవటమే బెటర్.

రేటింగ్. 1.5/5

Next Story
Share it