Telugu Gateway
Movie reviews

‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ రివ్యూ

‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ రివ్యూ
X

తరుణ్ భాస్కర్ దాస్యం. ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించారు. అదే ‘పెళ్లి చూపులు’. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఒక్క సినిమాతో తరుణ్ భాస్కర్ స్టార్ డైరక్టర్ గా మారాడనే చెప్పుకోవచ్చు. ఆయనే సొంతంగా కథ సిద్ధం చేసుకుని..దర్శకత్వం వహించిన సినిమానే ‘ ఈ నగరానికి ఏమైంది’. ఇందులో హీరో..హీరోయిన్ల అందరూ కొత్తవారే. మరి పెళ్లిచూపులు సినిమాతో సంచలనం సృష్టించిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో ఎలా ఫలితాన్ని రాబట్టారో చూద్దాం. ఈ సినిమాలో విశ్వక్ హీరోగా నటించారు. ఇది ఓ నలుగురు మిత్రుల కథ. అంతా సినిమా పిచ్చొళ్ళే. అందులో ఒకరు కెమెరామెన్. మరొకరు డైరక్టర్. మిగిలిన ఇద్దరిలో ఒకరు డబ్బింగ్ ఆర్టిస్ట్..మరొకరు ఎడిటర్. ఏమి చేయాలో తెలియక షార్ట్ పిల్మ్ లు...సినిమాలపై ఆశలతో అలా తిరుగుతుంటారు. మధ్యలో డైరక్టర్ కావాలనే కలలు కనే యువకుడు ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ కాస్తా మధ్యలోనే బ్రేకప్ అవతుంది. అప్పటి నుంచి ప్రేమ కథలతో...రొమాన్స్ సీన్లతో షార్ట్ ఫిలిం తీయటానికి కూడా ఇష్టపడడు. ఇది మిత్రుల బృందాన్ని ఇబ్బందుల పాలు చేస్తుంది.

సినిమా అంతా ఈ షార్ట్ ఫిల్మ్ ల చుట్టూనే తిరుగుతుంది. ఈ మధ్యలో జరిగే అనేకానేక సంఘటనల సమాహరమే ‘ ఈ నగరానికి ఏమైంది?’. సినిమాలో వచ్చే సంభాషణలు యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇది పూర్తిగా యువతను లక్ష్యంగా పెట్టుకుని తీసిన సినిమాగానే కన్పిస్తుంది. డబ్బున్న అమ్మాయిని పెళ్ళి చేసుకుని..అమెరికా వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే పాత్రలో హీరో ఉంటాడు. ఈ మధ్యలో జరిగే సంఘర్షణ ప్రతి యువకుడి జీవితంలో ఎదురయ్యేదే. అయితే ఈ సినిమాలోనూ అక్కడక్కడ ‘పెళ్ళిచూపులు’ సినిమా జాడలు కన్పిస్తాయి. ఓవరాల్ గా చూస్తే సినిమా ఓకే అన్పించినా...తరుణ్ భాస్కర్ తొలి సినిమా పెళ్ళి చూపులు అంత గ్రిప్పింగ్ ఈ సినిమాలో కన్పించదు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ లో బడ్జెట్ తోనే ఈ సినిమాను పూర్తి చేసినట్లు కన్పిస్తోంది.

రేటింగ్. 2.5/5

Next Story
Share it