Telugu Gateway
Cinema

ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర

ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర
X

సంచలనం. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హత్యకు కుట్ర జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ముఖ్యంగా కర్ణాటక పత్రికల్లో దీనికి సంబంధించిన వార్తలు ప్రముఖంగా వచ్చాయి. గత కొంత కాలంగా ప్రకాష్ రాజ్ కేంద్రంలోని బిజెపి ఫ్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న విషయం తెలిసిందే. గౌరీ లంకేష్ హత్య విషయంలో కూడా ప్రకాష్ రాజ్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈకేసును విచారిస్తున్న సిట్ అధికారులకు ప్రకాష్ రాజ్ హత్యకు కూడా కుట్ర పన్నారని గుర్తించినట్లు సిట్ తెలిపింది. కన్నడ పత్రికల్లో వచ్చిన వార్తలపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇలాంటి వాటిని చూసి తాను ఎంతమాత్రం బెదిరిపోనని, భవిష్యత్‌లో మరింత దూకుడు పెంచి విద్వేషపూరిత రాజకీయాలపై పోరాడతానని అన్నారు.

Next Story
Share it