Publisher is the useful and powerful WordPress Newspaper , Magazine and Blog theme with great attention to details, incredible features...

మే9…విజయ్ దేవరకొండ స్పెషల్

0

నిజంగా మే 9 హీరో విజయ్ దేవరకొండ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఆయన నటించిన సినిమా ‘మహానటి’ ఇదే రోజు విడుదల అయింది. ఈ రోజు విజయ్ పుట్టిన రోజు కూడా కావటం విశేషం. అంతే కాదు..విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘ట్యాక్సీవాలా’ టీజర్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహానటిలో విజయ్ పాత్ర పరిమితమే  అయినా..మంచి పేరు వచ్చింది. ఇఫ్పటికే పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి సూపర్ హిట్స్ తో దూసుకెళుతున్న విజయ్ ప్రస్తుతం ట్యాక్సీవాలా సినిమాలో బిజీగా ఉన్నారు. ఇటీవలే టాక్సీవాలా సినిమా కాన్సెప్ట్‌ జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ‘ద డ్రీమ్‌బిహెండ్‌ ద టాక్సీవాలా’ అంటూ ఓ వీడియోను రిలీజ్‌చేశారు. ప్రేక్షకుల నుంచి ఈ వీడియోకు మంచి ఆదరణ లభించింది.

- Advertisement -

 

Leave A Reply

Your email address will not be published.