Telugu Gateway
Telangana

జర్నలిస్టులనూ కెసీఆర్ మోసం చేశారు

జర్నలిస్టులనూ కెసీఆర్ మోసం చేశారు
X

సమాజంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లుగానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ జర్నలిస్టులనూ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని రీతిలో మీడియా అణచివేతకు గురవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారన్నారు. అసెంబ్లీ లో ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులను బహిష్కరిస్తున్నారు ఈ ఈపాలకులు అని విమర్శించారు. జర్నలిస్టులకు కెసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చే శక్తి ఉందన్నారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత మనందరి మీదా ఉందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో ఎవరు సీఎం అయినా అందరికి అందుబాటులో ఉంటారు...ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో జర్నలిస్ట్ లకు ప్లాట్స్ ఇచ్చామని తెలిపారు. 2019లో కాంగ్రెస్ మీ సహకారంతో అధికారంలోకి వస్తుంది...జర్నలిస్టులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారరు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలోని జర్నలిస్ట్ లకు ఇళ్లస్థలాలు, ఉచితంగా హెల్త్ ట్రీట్ మెంట్, అందరికి అక్రిటిడేషన్ కార్డులు, మరణించిన జర్నలిస్టు లకు 3 లక్షల రూపాయల వరకు పెంచుతూ మేనిఫెస్టో లో పెడతామని తెలిపారు. జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యపై ఆమోదయోగ్యమైన ఉచిత విద్యపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో టీజేఏస్ అధ్యక్షులు కోదండరాం, సీపీఐ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, వైస్సార్సీపీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి లతోపాటు జర్నలిస్ట్ నానాయకులు శ్రీనివాస్ రెడ్డి, అమర్, నగునూరి శేఖర్, విరహత్ అలీ, ఐజేయు అధ్యక్షులు సిన్హా తదితరులు పాల్గొని మాట్లాడారు.

Next Story
Share it