Telugu Gateway
Andhra Pradesh

మురళీమోహన్ క్షమాపణ

మురళీమోహన్ క్షమాపణ
X

టీడీపీ ఎంపీ మురళీమోహన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. రాజమండ్రిలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ బిజెపికి కర్ణాటకలో మెజారిటీ సీట్లు రాకుండా చేసింది వెంకన్న చౌదరే అని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా పెద్ద వివాదం రేపింది. దేవుడికి కూడా కులాలు అంటకడతారా? అంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనిపై ఆయన శుక్రవారం నాడు ఓ వీడియో ద్వారా వివరణ ఇఛ్చారు. పొరపాటున నోరు జారి చేసిన వ్యాఖ్యలే తప్ప...దేవుడికి కులాన్ని అంటగట్టే అంత తెలివితక్కువ వాడిని కాదని తెలిపారు. అప్పటివరకూ పక్కన కూర్చున్న ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరితో మాట్లాడుతూ ఉండటం వల్ల నోరుజారి వెంకన్న చౌదరి అని వచ్చిందే తప్ప..అందులో ఎలాంటి ఉద్దేశంలేదన్నారు. అసలు కులాల మీదే తనకు నమ్మకం లేదన్నారు.

అలాంటిది వెంకటేశ్వరాస్వామికి తాను కులం ఎలా అంటకడతానని ప్రశ్నించారు. పొరపాటున నోరుజారటం సహజమే. అలాంటివి జరుగుతుంటాయి. అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దేవుడికి కులాలు అంటకడదామనే భావన తనకు ఏ మాత్రం లేదన్నారు. తాను శుక్రవారం ఉదయం పూజ చేస్తూ కూడా పొరపాటుకు దేవుడి దగ్గర కూడా క్షమాపణ చెప్పానన్నారు. ఏదో ఒక సాకు చెప్పొచ్చు కానీ..తనకు అలాంటి ఉద్దేశం లేదని.. పొరపాటున జరిగిన సంఘటన అని తెలిపారు. తాను అన్న మాటను వెంకటేశ్వరస్వామి క్షమించి తనకూ...అలాగే అందరికీ మేలు చేస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=3tScpyEOZ2k&feature=youtu.be

Next Story
Share it