Telugu Gateway
Andhra Pradesh

అమిత్ షాకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

అమిత్ షాకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయం చేయటంలేదు..పరిపాలనే చేస్తున్నానని నమ్మితే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తక్షణమే క్షమాపణ చెప్పాలని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అంతే కాదు..ఎస్సీని తక్షణమే సస్పెండ్ చేయాలి. దాడికి కారణం అయిన వారిని అరెస్టు చేయాలన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ పై చెప్పులు వేయించిన చరిత్ర ఉందని అన్నారు. తిరుమలలో అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తల దాడికి చంద్రబాబే బాధ్యత వహించాలని అన్నారు. దాడి చేయించింది ఆయనే...తర్వాత ఎందుకు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు నటిస్తున్నది ఆయనే అని ఎద్దేవా చేశారు. గతంలో తన ఇంటిపైకి కూడా టీడీపీ కార్యకర్తలను పంపారని తెలిపారు. నిజంగా చంద్రబాబు రాజకీయం చేయదలచుకోకపోతే ప్రధాని నరేంద్రమోడీపై బాలకృష్ణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పుడు నవ్వుతూ కూర్చోరని అన్నారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే అమిత్ షాను దర్శనం అప్పుడు బాగానే చూసుకున్నామని...వెళ్ళేటప్పుడే రాళ్లదాడికి ప్రయత్నించామని చెప్పినట్లు ఉందన్నారు.

ప్రజలందరికీ రక్షణ కల్పిస్తారని చంద్రబాబును గెలిపిస్తే ఆయన ఇప్పుడు అందరూ తనకు రక్షణగా నిలబడాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తికి 2019 ఎన్నికల్లో ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ఏపీలో చాలా మంది కృత్రిమ నాయకులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన ఎంత చక్కగా ఉ:దో అలిపిరి ఘటన చెబుతోందని విమర్శించారు. తిరిగి బిజెపి కార్యకర్తలపై కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హోదా విషయంలో చంద్రబాబు గతంలో ఏమి మాట్లాడారు...ఇప్పుడు ఏమి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఏడాది ముందు మాత్రమే యూటర్న్ తీసుకున్నారని..అది కూడా ప్రతిపక్షాన్ని చూసి భయపడి ఈ పనిచేశారన్నారు.

Next Story
Share it