Telugu Gateway
Top Stories

ప్రపంచ అతిపెద్ద రూట్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్

ప్రపంచ అతిపెద్ద రూట్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్
X

సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోని అతి పెద్ద రూట్ లో సర్వీసులు ప్రారంభించేందుకు రెడీ అయింది. అక్టోబర్ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. సింగిల్ టేక్ లోనే సింగపూర్ ఎయిర్ లైన్స్ ఈ రూటులో 18 గంటల 45 నిమిషాల పాటు ప్రయాణించనుంది. ఈ రూటు మొత్తం దూరం 16,700 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రూట్ సింగపూర్ నుంచి నీవార్క్ వరకూ. ఎయిర్ బస్ ఏ350-900 యుఎల్ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ మార్గంలో సర్వీసులు ప్రారంభించనుంది. ఇందులో 67 బిజినెస్ క్లాస్, 94 ప్రీమియం ఎకానమీ సీట్లు ఉంటాయి. వాస్తవానికి సింగపూర్ ఎయిర్ లైన్స్ ఈ మార్గంలో 2004 నుంచి 2013 వరకూ సర్వీసులు నడిపింది.

కానీ ఈ రూట్ అంత లాభదాయకంగా లేకపోవటంతో సర్వీసులు నిలిపివేసింది. ఇప్పుడు తిరిగి ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. నీవార్క్ కూడా న్యూయార్క్ సిటీకి సేవలందించే మూడు ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటి. సింగపూర్ ఎయిర్ లైన్స్ నీవార్క్ కు సర్వీసులు ప్రారంభిస్తే ఇఫ్పటివరకూ ఉన్న లాంగెస్ట్ రూట్ వెనక్కి పోయి..ఇది ముందుకు వస్తుంది. ఈ విమానంలో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందించనున్నారు. ప్రపంచంలో అతి పెద్ద రూట్ అయినా ప్రయాణికులు తమ విమానంలో రిలాక్స్ గా ప్రయాణం చేయగలరని సింగపూర్ ఎయిర్ లైన్స్ చెబుతోంది.

Next Story
Share it