Telugu Gateway
Andhra Pradesh

ఏపీకి సహకరిస్తాం..అవినీతికి కాదు

ఏపీకి సహకరిస్తాం..అవినీతికి కాదు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని..అంతే కానీ అవినీతికి కాదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 100 శాతం నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. రైల్వే జోన్ తోపాటు అన్ని హామీలను అమలు చేసి తీరతామని ప్రకటించారు. పదేళ్ళ కాలానికి షెడ్యూల్ వేసుకుంటే మూడేళ్ళకే టీడీపీ రాజకీయ దురుద్దేశంతో ఎన్డీయే నుంచి బయటికిపోయిందని ఆరోపించారు. టీడీపీకి ఎప్పుడూ బలమైన ప్రభుత్వాలు అవసరం లేదని..బలహీనమైన ప్రభుత్వాలనే ఆ పార్టీ కోరకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ గతంలోనే బహిరంగంగా చెప్పారని..సీమాంధ్ర స్కామాంధ్రగా మారితే సహించేదిలేదన్నారని తెలిపారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని పెడితే..చంద్రబాబు అదే కాంగ్రెస్ నేతలతో చేతులు కలుపుతున్నారని రామ్ మాధవ్ విమర్శించారు. 2019లో బిజెపి సొంతంగానే ఏపీలోనూ అధికారంలోకి వస్తామని..ఈ దిశగా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

మోడీ పాలన నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా ఏపీలో బిజెపి విజయోత్సవ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో రామ్ మాధవ్ ప్రసంగించారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ నినాదంతో 200 పైగా సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఘనత బీజేపీదని తెలిపారు. బీజేపీ తో బాగస్వమ్యంతో టీడీపీ కి అధికారం దక్కిందని రామ్ మాధవ్ తెలిపారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా రాజకీయ ఎదుగుదలకు మామగారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. బిజెపిని ఎదుర్కొలేకే కొత్త ఫ్రంట్లు..టెంట్లు వస్తున్నాయని అన్నారు. నిజాయితీ తో కూడిన పాలనను అందిస్తున్న మోడీ సర్కారుకు ఎప్పుడూ ప్రజల ఆశీస్సులు ఉంటాయన్నారు. అత్యంత విశ్వసనీయతతో, పారదర్శకతతో కూడిన స్వచ్ఛమైన పరిపాలన అందిస్తుంటే కొందరు ఇంత నిజాయితితో పని చేస్తే మేము మీతో ఉండం అని మధ్యలోనే స్నేహాన్ని వదిలేస్తున్నారని ఎద్దేవాచేశారు. అనరాని మాటలతో దేశ ప్రధానిని తిడుతున్నా దేశ ప్రజలు సహిస్తున్నారని తెలిపారు.

Next Story
Share it