Telugu Gateway
Cinema

‘ఆఫీసర్’ ట్రైలర్ వచ్చేసింది

‘ఆఫీసర్’ ట్రైలర్ వచ్చేసింది
X

సినిమా విడుదలకు ముహుర్తం దగ్గర పడుతుండటంతో ‘ఆఫీసర్’ చిత్ర యూనిట్ ప్రచార జోరు పెంచింది. నాగార్జున హీరోగా నటించిన ఆఫీసర్ సినిమా ఈ నెల 25నే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నాగార్జున కు జోడీగా మైరా సరీన్ నటిస్తోంది. ఆమెకు ఇదే తొలి చిత్రం. ఇప్పటికే ఆఫీసర్ కు సంబంధించి రెండు టీజర్లు విడుదల చేసి వర్మ ...శనివారం నాడు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగార్జున ముంబయ్ మాఫియాతో పోరాటం సాగించే పోలీసు అధికారిగా కన్పించనున్నారు.

మాఫియా కథలు అంటే వర్మకు కొట్టిన పిండి. ‘శివ’ తర్వాత నాగార్జున, వర్మలు కలసి చేస్తున్న సినిమా ఇదే కావటంతో అందరికీ దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. వర్మ ఫెయిల్యూర్స్ తో ఉన్న నాగార్జున కూడా ఈ సినిమాకు ఓకే చెప్పేశాడు. వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్లకు పెద్ద ఎత్తున డిజ్ లైక్స్ వస్తున్నా వర్మ సవాళ్ళు విసురుతున్నారే తప్ప.. ఏమాత్రం సీరియస్ గా తీసుకోవటం లేదు. పైగా పవన్ ఫ్యాన్స్ ఇంత తక్కువ మందే ఉన్నారా? అంటూ వెటకారాలు ఆడారు ఈ మధ్య.

https://www.youtube.com/watch?v=S3tGLg27NtA

Next Story
Share it