Telugu Gateway
Top Stories

సుప్రీం జడ్జిగా జోసెఫ్ పేరు మళ్ళీ..

సుప్రీం జడ్జిగా జోసెఫ్ పేరు మళ్ళీ..
X

కేంద్రం ఈ సారి అయినా దిగొస్తుందా?. న్యాయవ్యవస్థతో ఘర్షణకే సిద్ధపడుతుందా?. తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి. సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులకు సంబంధించి గతంలో కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో కె ఎం జోసెఫ్ పేరున్నా కేంద్రం ఈ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని కొలీజీయం శుక్రవారం నాడు మరోసారి సమావేశం అయి జోసెఫ్ పేరును సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతికి సిఫారసు చేయాలని నిర్ణయించింది. ఏకగ్రీవంగానే ఈ తీర్మానం చేశారు. జోసెఫ్ పదోన్నతిపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ చలమేశ్వర్ తో పాటు మరికొంత మంది సీజెఐకు లేఖలు రాశారు.

దీంతో ఈ సమావేశం జరిగింది. కొలీజయం రెండుసార్లు సిఫారసు చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఈ తరుణంలో జోసెఫ్ పదోన్నతి ఉత్కంఠగా మారింది. ఇతర న్యాయమూర్తుల పదోన్నతుల సిఫారసు సమయంలో జోసెఫ్ పేరును కూడా పంపాలని నిర్ణయించినట్లు సమాచారం. దీని కోసం ఈ నెల 16న మరోసారి సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it