Telugu Gateway
Telangana

తెలంగాణ బిజెపి రైతు రుణ మాఫీ హామీ రెండు లక్షలు

తెలంగాణ బిజెపి రైతు రుణ మాఫీ హామీ రెండు లక్షలు
X

తెలంగాణ బిజెపి శాఖ రైతు రుణ మాఫీ రేసులోకి దూకింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేయటంతోపాటు..ఉచితంగా రైతులకు బోరు వేయిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. అదే సమయంలో రైతులకు తొమ్మిది గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. దీంతోపాటు మద్దతు ధరల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ అయితే గత ఏడాది కాలంగా ఇదే హామీని రైతుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ హామీలను అధికార టీఆర్ఎస్ కొట్టి పారేస్తుంది. ఒకేసారి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సాధ్యంకాదని అధికార పార్టీ చెబుతోంది.

అయినా కాంగ్రెస్, బిజెపిలు మాత్రం హామీలతో ముందుకెళ్ళటానికే నిర్ణయించుకున్నాయి. టీఆర్ఎస్ సర్కారు పెట్టుబడి రాయితీ పేరుతో పంటకు నాలుగు వేల రూపాయల లెక్కన ఇవ్వటానికి రెడీ అయింది. రెండు పంటలకు ఇలా ఇవ్వనున్నారు. కెసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలోనూ తాము అదికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణలో విజయబావుటా ఎగరేస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో రైతులు కష్టాల పాలు అవుతున్నారని లక్ష్మణ్ విమర్శించారు.

Next Story
Share it