Telugu Gateway
Cinema

టాలీవుడ్ టాప్ దర్శకుడిపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు!

టాలీవుడ్ టాప్ దర్శకుడిపై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు!
X

టాలీవుడ్ లో ఇప్పుడు నటి శ్రీరెడ్డి కలకలం రేపుతోంది. ఆమె ఎప్పుడు ఎవరి పేరు బయటపెడుతుందా? అన్న టెన్షన్ లో కొంత మంది పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. శ్రీరెడ్డి సోమవారం నాడు తన ఫేస్ బుక్ పేజీలో ఓ ప్రముఖ దర్శకుడి గురించి సంచలన విషయాలు బహిర్గతం చేసింది. కొద్ది రోజుల క్రితం ఆమె టాలీవుడ్‌లో ‘కాస్టింగ్ కౌచ్’ విపరీతంగా పెరిగిపోయిందని, అందుకే తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని ఆరోపించింది. ఆ తర్వాత మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న సినీ నటి శ్రీరెడ్డి పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన యువతులతో రాసలీలలు సాగించి... ఆ తర్వాత చాన్సులిస్తామంటూ మభ్యపెట్టే టాలీవుడ్ సినీ ప్రముఖుల పేర్లు బయటపెడతానని చెప్పిన శ్రీరెడ్డి ఓ దర్శకుడి పేరు పరోక్షంగా ప్రస్తావించి బాంబు పేల్చింది.

అదేంటో మీరూ చూడండి ‘ పెద్ద డైరక్టర్ అని పొగరు. అబద్దాలు చెప్పటంలో దిట్ట. తెలుగు అమ్మాయిలు పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని అతని ప్రగాడ విశ్వాసం. ప్రామిస్ లు బ్రేక్ చేయటంలో వీరి తర్వాతే ఎవరైనా. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరకకుండా బాగా వాడతాడు టెక్నాలజీని. మా ఇంటి ముందు గుర్ఖా లా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసుకుంటాడు పాపం. మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వారెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖరుడు’ అంటూ పోస్టును క్లోజ్ చేసింది శ్రీ రెడ్డి. ఆమె చెప్పిన విషయాలు అన్నీ చూస్తే శ్రీరెడ్డి చెబుతున్నది శేఖర్ కమ్ముల గురించే అని అర్థం అవుతోంది. మరి ఆమె ఆరోపణలపై శేఖర్ కమ్ముల స్పందిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

Next Story
Share it