Telugu Gateway
Top Stories

ఇరవై ఏళ్ల తర్వాత సల్మాన్ కు శిక్ష

ఇరవై ఏళ్ల తర్వాత సల్మాన్ కు శిక్ష
X

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చిక్కుల్లో పడ్డారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో ఆయనకు ఇరవై సంవత్సరాల తర్వాత శిక్షపడింది. రెండు కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ను జోధ్‌పూర్‌ న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్‌ అడవుల్లో సల్మాన్‌ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైన సంగతి తెలిసేందే.

మూగజీవుల ప్రాణాలను బలిగొన్నందుకు వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 లోని 9/51 ప్రకారం సల్మాన్‌​ ఖాన్‌కు ఐదేళ్ళ జైలు శిక్ష విధించారు. జింకలను క్రూరంగా వేటాడిన సల్మాన్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. జోధ్‌పూర్‌ కోర్టు తీర్పును సల్మాన్‌ ఖాన్‌ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని సమాచారం. సల్మాన్‌ దోషిగా తేలడంతో ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న ఆయన సినిమాల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

Next Story
Share it