Telugu Gateway
Cinema

‘రంగస్థలం’ గ్రాస్ 175 కోట్లు

‘రంగస్థలం’ గ్రాస్ 175 కోట్లు
X

టాలీవుడ్ లో ‘రంగస్థలం’ సినిమా కొత్త రికార్డులు రాస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. రామ్ చరణ్, సమంతలు జోడీగా నటించిన ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవటం కూడ రంగస్థలానికి కలిసొచ్చింది. రామ్ చరణ్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా ఈ సినిమా నిలవనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి మరీ వసూళ్ళు సాధిస్తోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పలు వర్గాలను ఆకట్టుకుంది.

కథ పాతదే అయినా..కథనంలో కొత్తదనంతో సుకుమార్ సినిమాను కూల్ గా నడిపించారు. ఇదే సినిమాకు ప్లస్ అయింది. ఇంత కాలం పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రాలకే పరిమితం అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ద్వారా తనలోని నటుడును బయటకు తీసినట్లు అయింది. హీరోయిన్ సమంత కూడా అచ్చం పల్లెటూరి పిల్లగా సూపర్ నటనను కనపర్చింది. మొత్తం మీద పలు అంశాలు కలిసొచ్చి ‘రంగస్థలం’ ను సూపర్ హిట్ చేశాయి.

Next Story
Share it