Telugu Gateway
Politics

తగ్గుతున్న మోడీ గ్రాఫ్..పెరుగుతున్న రాహుల్ జోరు

తగ్గుతున్న మోడీ గ్రాఫ్..పెరుగుతున్న రాహుల్ జోరు
X

దేశమంతా మోడీపై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలో ధీమా అంతకంతకూ పెరుగుతుంది. ఎందుకంటే మోడీకి ఇమేజ్ తగ్గితే కాలం కలసి వచ్చేది కాంగ్రెస్ కే కదా?. అందుకే ఆయన కూడా స్పీడ్ పెంచుతున్నాడు. అలా ఇలా కాదు..విభేదాలు అన్ని పక్కన పెట్టి విపక్షాలు అన్నీ కలిస్తే ఏకంగా ప్రధాని నరేంద్రమోడీని ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోనూ ఓడిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల విపక్షాలు అన్నీ ఒక్కటవుతున్నాయని..అదే బిజెపిలో గుబులు రేపుతోందని అన్నారు.

ఉత్తర ప్రదేశ్ లో ఎస్సీ, బిఎస్పీ, కాంగ్రెస్ ఒక్కటైతే బిజెపికి రెండు సీట్లు మాత్రమే వస్తాయన్నారు. కొద్ది రోజుల క్రితం ఎస్సీ, బిఎస్పీ కలసి అధికార బిజెపికి భారీ షాక్ ఇచ్చాయి. దేశంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు. దీనికి ప్రధాన కారణం మోడీ, బిజెపిల వైఖరే అన్నారు. అంబేద్కర్, బసవన్న విగ్రహాలకు నమస్కరించే మోడీ వారి సిద్ధాంతాల మాత్రం కాలరాస్తున్నారని విమర్శించారు.

Next Story
Share it