Telugu Gateway
Telangana

శ్రీరెడ్డి ఎపిసోడ్.. ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసులు

శ్రీరెడ్డి ఎపిసోడ్.. ఎన్ హెచ్ ఆర్ సీ నోటీసులు
X

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి పేరు చెపితే చాలు ఉలికిపడుతున్నారు చాలా మంది. ఈ తరుణంలో శ్రీరెడ్డి వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఏకంగా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ ఆర్ సీ) సుమోటోగా ఈ కేసును టేకప్ చేసింది. అదే సమయంలో తెలంగాణ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. అవకాశాల కోసం పరిశ్రమలోకి వస్తున్న అమ్మాయిలను లైంగిక అవసరాలకు వాడుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తూ పరిశ్రమలో కలకలం రేపింది. అంతే కాదు..మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం వద్ద అర్థనగ్న ప్రదర్శన చేసి మరీ..దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది శ్రీరెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సమాచార ప్రసారశాఖకు కూడా ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది.

కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సవివరమైన నివేదిక ఇవ్వాల్పిందిగా ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసుల్లో పేర్కొంది. సినిమాల్లో నటించకుండా శ్రీరెడ్డిపై ‘మా’ ఆంక్షలు విధించడం, ఆమె హక్కులకు భంగం కలిగించడమేనని ఎన్‌హెచ్‌ఆర్సీ ఈ సందర్బంగా అభిప్రాయపడింది. క్యాస్టింగ్ కౌచ్‌, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళం విప్పిన శ్రీరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. ‘మా’లో లైంగిక వేధింపుల వ్యతిరేక సంఘం(క్యాష్‌ కమిటీ) ఎందుకు వేయలేదని ప్రశ్నించింది.

Next Story
Share it