Telugu Gateway
Top Stories

నిరాహారదీక్షలో సీఎం..డిప్యూటీ సీఎం

నిరాహారదీక్షలో సీఎం..డిప్యూటీ సీఎం
X

కావేరీ జలాల వ్యవహారం కాకపుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ ప్రతిష్టంభనకు ఇదే అంశం కారణంగా మారింది. సభ ప్రారంభం అయిన వెంటనే అన్నాడీఎంకె సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి కావేరి బోర్డు ఏర్పాటు చేయాలంటూ నినాదాలు ఇస్తున్నారు. ఇదే కారణంతో లోక్ సభలో రావాల్సిన అవిశ్వాస తీర్మానం కూడా చర్చకు రాకుండా పోతోంది. ఈ తరుణంలో ఏకంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమత్రి పన్నీర్ సెల్వం నిరాహారదీక్షకు దిగటం కలకలం రేపుతోంది. వెంటనే కావేరీ జలాల మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నాడీఎంకే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది.

ఈ నిరాహార దీక్షలో పార్టీ శ్రేణులు, నేతలు, మంత్రులు పాల్గొంటారని మొదట తెలిపారు. దీక్షలో కూర్చునే నేతల జాబితాలో సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్‌ పేరు లేదు. కానీ, కావేరీ జలాల విషయంలో అన్నాడీఎంకే కేంద్రంపై తగినంత ఒత్తిడి తీసుకురావడం లేదన్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఏకంగా పళని, పన్నీర్‌ ఇద్దరూ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు దీక్షలో పాల్గొంటున్నాయి.

Next Story
Share it