Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది!

చంద్రబాబు సీనియారిటి దేనికి పనికొచ్చింది!
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై విమర్శలకు తానే అవకాశం కల్పిస్తున్నరా?. అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. దేశంలో అందరి కంటే తానే సీనియర్ అని..తనను మించిన సీనియర్ ఎవరూలేరని చంద్రబాబు ప్రగాఢ విశ్వాసం. మరి అంత సీనియర్ అయితే ఎలా ఉండాలి. ఏపీని ఎలా పరుగులు పెట్టించాలి. కానీ చేస్తున్నది ఏమిటి?. తన సీనియారిటీని రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా...స్కీమ్ స్కీమ్ లోనూ స్కాం చేసి..వందల కోట్ల రూపాయలు ఎలా దోచుకోవాలన్నదానికే ఉపయోగిస్తున్నట్లు కన్పిస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన సీనియారిటీ ఎలా ఫెయిలయిందో ఓ సారి చూడండి.

  1. టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు రావటానికి ఏడాది ముందు నుంచే ప్రధాని మోడీ చంద్రబాబుకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏమి జరుగుతుందో అప్పుడు ఆయనకు తెలియదా?. ఆ మాత్రం స్మెల్ చేయలేకపోయారా?.
  2. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినప్పుడే అందులో విభజన చట్టంలో ఉన్నవే తప్ప..కొత్తగా ఏమీలేవని అందరూ గగ్గోలు పెట్టారు. ఎంతో సీనియర్ అయిన..ప్రభుత్వ వ్యవస్థ చేతిలో ఉన్న చంద్రబాబు ఎందుకు ప్యాకేజీలో ఏమీలేవని ఎందుకు అంచనాకు రాలేకపోయారు?. చట్టబద్దత అంటూ హడావుడి చేసి చివరకు వెనక్కితగ్గారు?

3.అంత సీనియర్ చంద్రబాబుకు ప్రత్యేక హోదాతో ఏమి వస్తాయో తెలియదా?. ఎవరైనా నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదా సాధించిన రాష్ట్రాలు ఏమి సాధించాయి అని అసెంబ్లీ సాక్షిగా ఎలా అనగలిగారు. ఇప్పుడు అదే హోదా వెంట ఎందుకు పరుగులు పెడుతున్నారు? ఎవరూ ఎడ్యుకేట్ చేయకుండానే ఎలా ఎడ్యుకేట్ అయ్యారో?.

  1. పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు రాజధాని అమరావతి డిజైన్లకు మూడేళ్ళ సమయం తీసుకుంటారా?. ఇది వ్యూహాత్మక ఎత్తగడ కాక ఇంకా ఏమైనా ఉందా?. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించే ఈ కాలంలో డిజైన్లకు మూడేళ్ళ కాలం తీసుకోవటంలో చంద్రబాబు సీనియారిటీ తేలిపోయిందా?
  2. నాలుగేళ్లు సఖ్యతతో ఉండి సాధిస్తానని...తనను నమ్మాలని ఏపీ ప్రజలను కోరిన చంద్రబాబు...ఇప్పుడు పోరాటం తప్ప..మరో మార్గం లేదని చెప్పటం వెనక మతలబు ఏమిటి?. మోడీ మట్టి..నీళ్ళు ఇచ్చినప్పుడే చంద్రబాబు లాంటి సీనియర్ కు అసలు విషయం అర్థం కాలేదా?. అప్పుడు ప్రజలందరూ తిట్టినా..సంతోషంగా వాటిని తీసుకున్నది చంద్రబాబే కదా?.
  3. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కాంట్రాక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం చేతికి తెచ్చుకోవటానికి చంద్రబాబు తన సీనియారిటీని ఉపయోగించుకున్నారా?

7.నాలుగేళ్లు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఏమీ సాధించలేని చంద్రబాబు లాంటి సీనియర్ ఇప్పుడు పోరాడి సాధించగలరా?. పోరాడటానికి ఏపీలో బిజెపికి ఉన్న బలం ఎంత?. బలగం ఎంత?.

  1. 545 ఎంపీ సీట్లు ఉన్న దేశంలో ఇప్పుడు తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే చాలు...తానే ప్రధానిని డిసైడ్ చేస్తాడట. అంటే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదిస్తాయా?. మిగిలిన పార్టీలకు సీట్లు రావా...వాళ్లకు చంద్రబాబులా ఏజెండాలు ఉండవా?.
  2. ఎన్నికలకు ముందు తన అనుభవంతో రైతు రుణమాఫీతోపాటు..రాజధాని కూడా అద్భుతంగా కడతానని ప్రజలను నమ్మించి...రైతు రుణమాఫీలో అడ్డంగా కోతలు పెట్టడానికి ఉపయోగించుకున్నారా తన సీనియారిటీని?
  3. చంద్రబాబు ప్రస్తుతం తన సీనియారిటీని కేబినెట్ లో అక్రమాలను సక్రమం ఎలా చేసుకోవాలా?. అధికారులు వద్దన్నా ఎలా ముందుకు వెళ్ళాలా అనే పనికే వాడుతున్నారు.

Next Story
Share it