Telugu Gateway
Andhra Pradesh

ఐబీ చీఫ్...నరసింహన్ వరస భేటీల రహస్యమేమిటో!

ఐబీ చీఫ్...నరసింహన్ వరస భేటీల రహస్యమేమిటో!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తానికి ఏదో జరుగుతోంది. కానీ ఏమి జరుగుతుందో మాత్రం ఎవరికీ అంతుచిక్కకుండా ఉంది. కొద్ది రోజుల క్రితమే ఐబీ చీఫ్ సడన్ గా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి వెళ్ళారు. వీరి భేటీ గురించిన వివరాలేమీ బయటకు రాలేదు. సడన్ గా...షెడ్యూల్ లో లేకపోయినా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ చేరుకోవటం. గవర్నర్ తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గంటన్నరపైగా సమావేశం కావటం మొత్తానికి ఏదో జరుగుతుందన్న అనుమానాలు మరింత బలపడేలా చేస్తున్నాయి. కేంద్రం..ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ తదితరులు ఏపీలో చంద్రబాబు సర్కారు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటంతో పాటు..కేంద్రం ఇచ్చిన నిధులను అడ్డగోలుగా వాడేసుకుని...దొంగ యూసీలు ఇవ్వటమే కాకుండా.. చంద్రబాబు అండ్ కో తమపై ఎదురుదాడి చేస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా నాలుగేళ్ళ పాటు..ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా వదిలేసి..చివరి ఏడాదిలో ఈ నినాదాన్ని ఎత్తుకుని తమపై దాడి చేయటం కేవలం రాజకీయ కోణంలో అనే అభిప్రాయంలో బిజెపి ఉంది. కేంద్రం చెబుతున్న ఎస్పీవీ అయితే ఆ నిధులను దారిమళ్ళించటానికి ఆస్కారం ఉండదు.

ఏ ఉద్దేశానికి అయితే కేటాయించారో దానికే ఉపయోగించాల్సి ఉంటుంది. అది ఇష్టం లేని చంద్రబాబు...బిజెపిపై ఎదురుదాడి చేస్తున్నారని చెబుతున్నారు. దీనికితోడు ధర్మదీక్ష పేరుతో సాగిన చంద్రబాబు దీక్షలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై బిజెపి నేతలు బాలకృష్ణను అరెస్టు చేయాలనే డిమాండ్ చేయటంతో పాటు..కేసులు కూడా పెట్టారు. కేంద్రం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ తో భేటీ వివరాలను మీడియాకు చెప్పటానికి చంద్రబాబు నిరాకరించారు. అయితే కేంద్రం చంద్రబాబుకు అటు ఐబి చీఫ్ తోపాటు...గవర్నర్ నరసింహన్ తో స్పష్టమైన సంకేతాలు పంపినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే అవి ఏంటి? ఎలా అమలు అవుతాయి అన్నది మాత్రం తేలాల్సి ఉంది. ధర్మ దీక్షలో కూడా చంద్రబాబు తనపై కేసుల గురించి పదే పదే ప్రస్తావించటంతోపాటు..తాను మోడీ కాదు కదా..ఎవరికి భయపడను అని పలు మార్లు వ్యాఖ్యానించటం పలు అనుమానాలకు తావిస్తోంది.

Next Story
Share it