Telugu Gateway
Andhra Pradesh

హోదా రాదని చెప్పిన బాబు నిరాహారదీక్ష ఎందుకో!

హోదా రాదని చెప్పిన బాబు నిరాహారదీక్ష ఎందుకో!
X

‘వచ్చే ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఏపీకి హోదా సాధిస్తా. అప్పుడు కేంద్రంలో చక్రం తిప్పుతా. మనం చెప్పిన వాళ్లే ప్రధాని అవుతారు.’. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు. అంటే ఇప్పట్లో ప్రత్యేక హోదా రాదనే చంద్రబాబే స్వయంగా తేల్చిసినట్లు అయింది. హోదారాదని..స్పష్టంగా తెలిసినా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఈ నెల 20న నిరాహారదీక్ష చేయటం వెనక మతలబు ఏమిటి?. రాజకీయం తప్ప. ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీ నిరాహారదీక్ష ను తప్పుపట్టిన చంద్రబాబు..ఇప్పుడు మళ్ళీ అదే పనిచేయటం విశేషం. అందరినీ ఏమి చేసినా ఢిల్లీలో చేయాలని చెప్పే చంద్రబాబు..మరి విజయవాడలో ఒక్క రోజు నిరాహారదీక్ష చేయటం ఏమిటో?. నిజంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీలో ఒక్క రోజు నిరాహారదీక్ష చేసినా ఆ ప్రభావం ఒకింత సంచలనంగానే మారుతుంది. జాతీయ మీడియా ఫోకస్ వస్తుంది. కానీ అదేమి లేకుండా కేవలం విజయవాడలోనే దీక్షకు కూర్చోవటం కేవలం రాజకీయంగా వెనకబడిపోకూడదనే ఉద్దేశం తప్ప..మరొకటి కాదనే విషయం తెలిసిందే.

ఏపీలో తెలుగుదేశం వైఖరి ఎలా ఉందంటే సైకిల్ ర్యాలీ..నిరసన ర్యాలీలు ఏదైనా తామే చేయాలి తప్ప..ఎవరూ చేయకూడదు అన్న చందంగా తయారైంది. అందుకే సోమవారం నాడు తలపెట్టిన బంద్ పై సన్నాయి నొక్కులు నొక్కింది తొలుత. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు అందరూ అసంతృప్తితో ఉన్నారనే విషయం గ్రహించే తొలిసారి సర్కారు బంద్ ను ఫెయిల్ చేసే ప్రయత్నం చేయటం లేదు. ఇదే అంశంపై గతంలో విపక్షాలు బంద్ కు పిలుపునిస్తే..ప్రభుత్వమే దగ్గరుండి బస్సులు అన్నీ నడిపించి బంద్ ఫెయిల్ చేసింది. అదీ ప్రభుత్వ తీరు. ఇప్పుడు మాత్రం ప్రజాగ్రహం తప్పదని గ్రహించి బంద్ విషయంలో మౌనంగా చూస్తూ కూర్చుంది. కానీ ఈసారి బంద్ కు పిలుపునిచ్చింది నేరుగా పార్టీలు కాకుండా..ప్రత్యేక హోదా సాధన సమితి కావటం కూడా అందుకు ఓ కారణం కావొచ్చు.

Next Story
Share it