Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు ‘హ్యాండిచ్చిన సౌదీ అరామ్ కో’

చంద్రబాబుకు ‘హ్యాండిచ్చిన సౌదీ అరామ్ కో’
X

మహారాష్ట్రలో కంపెనీ భారీ పెట్టుబడులు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘దావోస్’ పర్యటనలు ‘ఆనంద పర్యటనలు’గానే మిగులుతున్నాయి. దావోస్ కు హాజరయ్యే ప్రతిసారి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు..లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ ఊదరగొట్టడం అందరూ చూసిందే. 2017 దావోస్ సమావేశంలోనూ...2018 దావోస్ సమావేశంలోనూ చంద్రబాబు ఒకే కంపెనీతో పదే పదే చర్చలు జరిపారు. అదే సౌదీ అరామ్ కో. ఇంకేమంది ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చేస్తున్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. సీన్ కట్ చేస్తే ప్రపంచంలోని అతి పెద్ద ఆయిల్ కంపెనీ అయిన సౌదీ ఆరామ్ కో మహారాష్ట్రలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ మహారాష్ట్రలో ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయు) కూడా బుధవారం నాడు జరిగింది. ఈ యూనిట్ కోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియంతో ఎంవోయు చేసుకున్నారు.

రత్నగిరి రిఫైనరీలో సౌదీ అరామ్ కో ఈ పెట్టుబడులు పెట్టనుంది. గత రెండు సార్లు చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం కార్యాలయమే సీఎం సౌదీ అరామ్ కోతో చర్చలు జరిపారని..ఈ కంపెనీ ఏపీలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందని తెలిపారు. ఈ వార్తలు అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగానే వచ్చాయి. కానీ ఇప్పుడు మహారాష్ట్రతో సౌదీ అరామ్ కో ఒప్పందం చేసుకున్నా...చంద్రబాబు దావోస్ పర్యటన గుట్టును మాత్రం ఎవరూ రట్టు చేసే ప్రయత్నం చేయటం చేయకపోవటం విశేషం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే..ఇలాందిటే జరిగితే...లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వెనక్కి అంటూ హంగామా చేసేవారు. చంద్రబాబు ఎన్ని స్కామ్ లు చేస్తున్నా ఇదే కదా..ఆయనకు కలిసి వస్తున్న అంశం.

Next Story
Share it