Telugu Gateway
Andhra Pradesh

‘ఎట్టకేలకు’ అసలు రాజధాని పనులకు టెండర్లు

‘ఎట్టకేలకు’ అసలు రాజధాని పనులకు టెండర్లు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏది చేపట్టినా కాస్ట్లీనే. ఒక్క సచివాలయానికే 2176 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. ఎట్టకేలకు అమరావతిలో అసలు రాజధాని పనులు ప్రారంభం కాబోతున్నాయి. తొలుత సచివాలయ నిర్మాణ పనులకు సీఆర్ డీఏ టెండర్లు పిలిచింది. సచివాలయాన్ని మొత్తం ఐదు టవర్లు గా అభివృద్ది చేయాలని నిర్ణయించారు.దీనికి 2176 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని లెక్కలేశారు. ఐదు టవర్ల మొత్తం నిర్మిత సామర్ధ్యం 34 లక్షల చదరపు అడుగులు ఉంటుందని తెలిపారు.

లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థ గత మూడేళ్లులుగా పలు మార్పులు చేసి సచివాలయ డిజైన్లు తయారు చేసింది. ఈ అంతర్జాతీయ ఎంతో పేరుగాంచిన ఈ సంస్థ చేసిన డిజైన్లకు ఏపీ సీఎం చంద్రబాబు పలు మార్పులు, చేర్పులు సూచించారు. కొత్త సచివాలయంలో ఎవరి బ్లాక్ వారికి ఉండేలా డిజైన్ చేశారు. కార్యదర్శులు, శాఖాధిపతులు కార్యాలయాల కోసం రెండు బ్లాక్ లు నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయాన్ని జీఏడీ టవర్ గా పిలుస్తున్నారు. మే 16లోగా ఆసక్తి ఉన్న సంస్థలు బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే రోజు సాంకేతిక బిడ్లను పరిశీలిస్తారు.

Next Story
Share it