Telugu Gateway
Andhra Pradesh

తెలుగుదేశం పార్టీకి మరో సవాల్

తెలుగుదేశం  పార్టీకి మరో సవాల్
X

అధికార తెలుగుదేశం పార్టీకి మరో సవాల్ ఎదురుకానుంది. అసలు అవిశ్వాసం వల్ల ఉపయోగం లేదంటూ వాదించిన టీడీపీ చివరకు తానే స్వయంగా అవిశ్వాసం పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల చివరి రోజున అందరూ రాజీనామా చేస్తామని ప్రకటించారు. అదీ స్పీకర్ ఫార్మాట్ లోనే ఉంటాయని తెలిపారు. దీంతో తెలుగుదేశం పార్టీ మరోసారి రాజకీయంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

అయితే వైసీపీ ఎంపీల తరహాలోనే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా? అంటే వేచిచూడాల్సిందే. ప్రత్యేక హోదా విషయంలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఏకంగా జగన్ ట్రాప్ లో పడిపోయాడని బిజెపి వంటి పార్టీలు బహిరంగంగానే విమర్శించాయి. వైఎస్సార్‌సీపీతోపాటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశవ్యప్తంగా చర్చ జరుగుతుంది. తద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఎంపీల రాజీనామాల వల్ల ఉపయోగం ఉండదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it