Telugu Gateway
Andhra Pradesh

ఏపీ బడ్జెట్ లో ఎవరికెంత?

ఏపీ బడ్జెట్ లో ఎవరికెంత?
X

ఆంధ్రప్రదేశ్ కు ఇది కీలక తరుణం. ఓ వైపు కేంద్రంతో ఫైటింగ్. మంత్రుల రాజీనామా. ఇంత కాలం కేంద్ర సాయం కోసం భారీగా ఎదురుచూపులు. కానీ కేంద్రం మాత్రం పెద్ద హ్యాండే ఇచ్చింది. ఈ తరుణంలో ఏపీ ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ఆమోదిస్తే ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ఖర్చులకు నిధులు అందుబాటులోకి రానున్నాయి. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారనుంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

మొత్తం ఏపీ బడ్జెట్‌ రూ.లక్షా 91 వేల 63 కోట్లు

రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు

మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు

ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు

వృద్ధిరేటు : 10.96శాతం

గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు

సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు

ఇరిగేషన్‌ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు

సాంఘిక సంక్షేమ రంగానికి రూ.13,722 కోట్లు

వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు

విద్యుత్‌ రంగానికి రూ.5వేల 52కోట్లు

పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు

వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు

కాపులకు రూ.వెయ్యి కోట్లు

కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు

దూదేకులవారికి కేటాయింపులు.. 40కోట్లు

నాయీ బ్రాహ్మణులకు 30కోట్లు

వెనుకబడిన తరగతుల సంస్థకు 100కోట్లు

వాల్మీకీ బోయిలకు 50కోట్లు

విద్యారంగానికి రూ.24,180కోట్లు

సాంకేతిక విద్యకు రూ.818కోట్లు

క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635కోట్లు

వైద్యరంగానికి రూ.8,463కోట్లు

మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు

గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు

పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు

సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు

కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు

సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు

సమాచార శాఖకు రూ.224కోట్లు

రుణమాఫీకి రూ.4100కోట్లు

వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు

సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు

ఎన్టీఆర్‌ వైద్య సేవలు రూ.1000 కోట్లు

స్టార్టప్ లకు రూ.100 కోట్లు

సామాజిక భద్రతకు రూ.3029కోట్లు

గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు

చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు

మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు

నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు

ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.200 కోట్లు

పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు

చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు

Next Story
Share it