Telugu Gateway
Andhra Pradesh

ఢిల్లీలో విజయసాయిరెడ్డి పాదాభివందనం రచ్చ

ఢిల్లీలో విజయసాయిరెడ్డి పాదాభివందనం రచ్చ
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం నాడు రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోడీకి పాదాభివందనం చేశారనే అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే వీటిపై విజయసాయిరెడ్డి కూడా అంతే ధీటుగా స్పందించారు. ఓ వైపు ప్రత్యేక హోదా విషయంలో మోడీ సర్కారు మోసం చేస్తే ..రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రధాని కాళ్ళకు నమస్కరించి ఐదు కోట్ల ఆంధ్రుల పరువు తీశారని ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. ఓ వైపు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం అంటూ నాటకాలు ఆడుతూ..మరో వైపు కేసుల మాఫీ కోసం ఇలాంటి నాటకాలు ఆడుతారా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా విజయసాయిరెడ్డి వెన్నుతట్టి పైకి లేపారని..దీన్ని బట్టే వారి బంధం ఎలాంటిదో కన్పిస్తోందని ఆరోపించారు. కావాలంటే తాను ప్రత్యక్ష సాక్ష్యులతో ఈ విషయం చెప్పిస్తానని అన్నారు. అయితే ఈ విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు.

తాను రాజ్యసభలో ప్రధానికి నమస్కారం చేశానే తప్ప...పాదాభివందనం చేయలేదని చెప్పారు. తనకంటే ముందు మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా ప్రధానికి నమస్కారం చేశారని..మోడీ కూడా ప్రతి నమష్కారం చేశారన్నారు. ఈ విషయాన్ని కూడా రాద్ధాంతం చేయటం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి దివాళకోరుతనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. తనను విజయమాల్యాతో పోల్చటంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ప్రపంచంలోని దొంగలు అందరికీ హెడ్ అయిన చార్లెస్ శోభరాజ్ వంటి వాడని విమర్శించారు. చంద్రబాబు అంటే తనకు రాజకీయంగా పడకపోయినా..ఆయన ఎదురైతే ఏపీ ముఖ్యమంత్రిగా నమస్కారం చేస్తానని..దానికి ప్రతి నమస్కారం చేయాలా వద్దా అనేది ఆయన సంస్కారానికే వదిలేస్తానని అన్నారు. తెలుగుదేశం పార్టీలోనే దొంగలు..క్రిమినల్స్ ఉన్నారని ఆరోపించారు.

Next Story
Share it