Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ పరువు తీస్తున్న చంద్రబాబు

టీడీపీ పరువు తీస్తున్న చంద్రబాబు
X

సాక్ష్యాత్తూ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీ పరువు తీస్తున్నారా?. ఆయన చేసే ఒక పనికి..మరో పనికీ లింక్ ఉండటం లేదా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఈ మొత్తం వ్యవహారాలు తెలుగుదేశం పార్టీ పరువును గంగలో కలిపేలా ఉన్నాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే భవిష్యత్ కష్టమే అన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. దేశంలో తానే సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు పిల్లిమొగ్గలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.

# కేంద్రంలో మోడీ సర్కారుకు పూర్తి మెజారిటీ ఉంది. అవిశ్వాసం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి?. రాజకీయాలు తప్ప దీని వల్ల ఏమీ కాదు.

# కానీ సడన్ గా తెలుగుదేశం పార్టీ శుక్రవారం నాడు మోడీ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకుంది. మరి మోడీ సర్కారు పడిపోనప్పుడు అవిశ్వాసం వల్ల ఉపయోగం లేనప్పుడు ఎందుకు అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు?. చంద్రబాబు అవిశ్వాసంపై ఎందుకు మళ్ళీ మాట మార్చాల్సి వచ్చింది?.

# ఏ1, ఏ2లు కోరితే మనం వాళ్ళకు మద్దతు ఇవ్వాలా?. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న మనం వాళ్ల దగ్గర రాజకీయాలు నేర్చుకోవాలా?. ఇది తొలి మాట.

# గురువారం సాయంత్రం అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతు ఇస్తాం. వైసీపీ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడానికి రెడీ అని ప్రకటించిన చంద్రబాబు.

# ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మనకంటే ముందే వైసీపీకి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో ఎలా తెలిసిపోయింది?. ఈ లెక్కన కేంద్రంలో ప్రధాని మోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షాలు సొంత భాగస్వామికి ఎంత విలువ ఇస్తున్నారో చంద్రబాబుకు తెలియలేదా?. అక్కడ విలువలేదని తెలిసి కూడా నిన్నమొన్నటివరకూ మౌనంగా ఎందుకు ఉన్నట్లు?.

# జగన్ కు మోడీ అపాయింట్ మెంట్ ఇచ్చి...ఎన్డీయేలో భాగస్వామిగా..ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు అపాయింట్ మెంట్ కు ఏడాదిన్నరపైగా తిప్పినప్పుడు చంద్రబాబు మోడీ తనకు ఇస్తున్న విలువ గ్రహించలేదా?.

# హోదా కంటే ప్యాకేజీనే బెస్ట్.. బెస్ట్ అంటూ నాలుగు సంవత్సరాలు నమ్మించి..చివర్లో ప్రత్యేక హోదా కోసం ఎంత దాకా అయినా పోరాడతాం అని మాట మార్చిన విషయం ‘వీడియో రికార్డుల’ సాక్షిగా చంద్రబాబు బుక్ కాలేదా? ఈ చర్యలు అన్నీ పార్టీ ప్రతిష్టను గతంలో ఎన్నడూలేనంత స్థాయిలో దెబ్బతీశాయని సీనియర్ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు.

Next Story
Share it