Telugu Gateway
Cinema

రాజమౌళి సినిమాలో రాజశేఖర్ లేరు

రాజమౌళి సినిమాలో రాజశేఖర్ లేరు
X

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమానే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మూడు ‘R’లతో ఓ వీడియో ను విడుదల చేశారు. అయితే తర్వాత ఈ సినిమాలో విలన్ గా రాజశేఖర్ చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలను జీవితా రాజశేఖర్ ఖండించారు.

రాజశేఖర్ ను ఆ సినిమాలో నటించాల్సిందిగా ఎవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ‘తమ కూతురు శివానీ హీరోయిన్‌ గా తెరకెక్కుతున్న 2 స్టేట్స్‌ సినిమా ప్రారంభోత్స కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాత్రమే రాజమౌళిని కలిసాం. మల్టీ స్టారర్‌కు సంబంధించి రాజమౌళి తమను సంప్రదించలేదన్నారు’ దీంతో రాజమౌళి మల్టీ స్టారర్‌లో రాజశేఖర్‌ విలన్‌ అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది.

Next Story
Share it