Telugu Gateway
Telangana

టీఆర్ఎస్..కాంగ్రెస్ ల మధ్య ‘మందు పంచాయతీ’

టీఆర్ఎస్..కాంగ్రెస్ ల మధ్య  ‘మందు పంచాయతీ’
X

తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోడియం వైపు హెడ్ ఫోన్స్ విసిరేయగా..అవి కాస్తా మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ కు తగిలి..ఆయన కంటికి స్పల్పగాయం అయింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్యం సేవించి అసెంబ్లీకి వచ్చారని..ఓ కాంగ్రెస్ సభ్యుడు తూలి జానారెడ్డిపై పడబోతే..ఆయన సభ నుంచి బయటకు వెళ్ళిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఓ ఎమ్మెల్సీ ఈ రకంగా మాట్లాడటానికి సిగ్గుండాలి. ఓ వైపు కెసీఆర్ ను మీ దగ్గర పెట్టుకుని మందు గురించి మీరు మాట్లాడతారా?.

ఫాం హౌస్ లో, ప్రగతి భవన్ లో..మిగిలిన చోట్ల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. సరే మా 12 మంది ఎమ్మెల్యేలం ఇక్కడే ఉంటాం. ముఖ్యమంత్రి కెసీఆర్ తో సహా అందరూ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుందాం. ఎవరి బాడీలో ఆల్కహాల్ ఉందో తెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ కూడా ముందుకొస్తే తాము కూడా అల్కహాల్ పరీక్షలు చేయించుకోవటానికి సిద్ధం అని తెలిపారు తెలంగాణలో మద్యం అమ్మకాలను అడ్డగోలుగా సాగిస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్న మీరు మందు గురించి మాట్లాడుతుంటే..దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని కోమటిరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

Next Story
Share it