Telugu Gateway
Telangana

కెసీఆర్ బినామీలకు 1200 కోట్ల ఆస్తులు...250 కోట్లకే

కెసీఆర్ బినామీలకు 1200  కోట్ల ఆస్తులు...250 కోట్లకే
X

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నేత, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కెసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ మెట్రోను కెసీఆర్ ఓ ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆరోపించారు. 1200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను 250 కోట్ల రూపాయలకే కెసీఆర్ బినామీ కంపెనీలకు బదిలీ చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణల వ్యవహారం కలకలం రేపుతోంది. మెట్రో అవినీతిని సభలో ప్రస్తావించకుండా అసద్‌తో కేటీఆర్‌ రహస్య చర్చలు జరిపారని విమర్శించారు. తన ఆరోపణలు నిజం కాకపోతే దీనిపై విచారణకు అదేశించాలని రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉండగా కెసీఆర్ మెట్రో రైలు ప్రాజెక్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని అప్పట్లో కెసీఆర్ ధ్వజమెత్తారు. అంతే కాదు..అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ముడుపులు ముట్టాయని తాను ఆరోపణ పెడుతున్నానని కూడా వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ముందుగా...సుల్తాన్ బజార్ నుంచి మెట్రో మార్గం వెళ్లటానికి వీల్లేదని....చారిత్రక భవనాలు దెబ్బతినటానికి అనుమతించేదిలేదని కెసీఆర్ గతంలో ప్రకటించారు. ఇదే కారణంతో మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో మెట్రో పనులు దాదాపు ఏడాది పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. మెట్రో అలైన్ మెంట్ మార్చాల్సిందే అంటూ పట్టుపట్టిన కెసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అసెంబ్లీ ముందుగా..సుల్తాన్ బజార్ నుంచే మెట్రో మార్గానికి లైన్ క్లియర్ చేశారు. లేదంటే ఇప్పటికే ఈ మార్గం రైలు రాకపోకలు మొదలయ్యేవి. మరి రేవంత్ రెడ్డి ఆరోపనలపై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it