Telugu Gateway
Andhra Pradesh

ప్రత్యేక హోదా పోరులో జూనియర్ ఎన్టీఆర్ ను దించాలి

ప్రత్యేక హోదా పోరులో జూనియర్ ఎన్టీఆర్ ను దించాలి
X

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అత్యంతక కీలకంగా మారిన ‘ప్రత్యేక హోదా’ పోరులో జూనియర్ ఎన్టీఆర్ ను దించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని..ఎన్టీఆర్ ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగపడగలడని పేర్కొన్నారు. చంద్రబాబు, ఎన్టీఆర్ ల మధ్య విభేదాలు ఏమిటో తనకు తెలియవని...నెగిటివ్ అంశాలు వదిలేసి..ఎన్టీఆర్ ను ఉపయోగించుకుంటే ఎంతో బాగుంటుందని సూచించారు. పాజిటివ్ గా వెళ్ళాలని సలహా ఇచ్చారు. ఎన్టీఆర్ నిజంగా బాగా చేస్తాడు. ఆ పిల్లోడు మీకు కావాల్సిన పాజిటివ్ రిజల్ట్ తేగలగటంలో సాయపడగలడు. ఎన్టీఆర్ రాష్ట్రంలో మంచి నాయకుడిగా కూడా ఉద్భవిస్తాడు. అతను మీకేమి నష్టం చేయడు. అంత భయం ఏమీ అక్కర్లేదు. భయం వల్లే అతన్ని బయటకు పంపారనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. నాకైతే ఏమీ లేవు. ఎన్టీఆర్ కు రాజకీయాల్లోకి వచ్చే అర్హతులు ఉన్నాయి. మాట్లాడే సామర్ధ్యం ఉంది. చాలా బాగా మాట్లాడతాడు. సమస్యలపై అవగాహన ఉంది. అవగాహనతో మాట్లాడేవారు లేక పోతుందోమో అన్న భయంతో చంద్రబాబు బ్యాలెన్స్ తప్పుతున్నారు.

లేకపోతే మీరు పాజిటివ్ గానే ఉండేవారు అంటూ వ్యాఖ్యానించారు తమ్మారెడ్డి. తిట్టడాలు..గిట్టడాలు మానేయండి. నాలుగేళ్ళ నుంచి చెబుతున్నారు వైసీపీ వాళ్ళు దొంగలనో..ఏదో. ఇఫ్పుడు కొత్తగా బిజెపిని తిట్టడం మొదలుపెట్టారు. కొంత కాలం జనసేనని తిట్టి. ఎంత కాలం ఎవరినో ఒకరిని తిట్టుకుని బతుకుతాం. మనం ఏమి చేస్తాం. మనం ఏంటి. మనం పాజిటివ్ గా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలం అనే ఒక్క అంశంపై మాట్లాడదాం అని సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూటకో మాట మాట్లాడుతున్న తీరును కూడా తమ్మారెడ్డి తప్పుపట్టారు. అసలు ముందు ప్రత్యేక హోదా ఎందుకు? అన్నారు. తర్వాత అవిశ్వాసం వల్ల ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించారు. తర్వాత అసెంబ్లీలో అవసరం అయితే వైసీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. తర్వాత మేమే అవిశ్వాసం పెడతామని ముందుకొచ్చారు. ఒక స్థిరత్వం లేకుండా చంద్రబాబు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చంద్రబాబు చాలా పాజిటివ్ లీడర్. పాజిటవ్ పోయి నెగిటివ్ వచ్చేసరికి చాలా కన్ఫూజన్ వచ్చేస్తోంది.

Next Story
Share it