Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కు ప్రమాదం..అంతా బోగస్

ఎన్టీఆర్ కు ప్రమాదం..అంతా బోగస్
X

జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం. బాత్ రూమ్ లో జారిపడ్డాడు. గాయాలు అయ్యాయి. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. ఇలా గత కొన్ని రోజులుగా కొన్ని వెబ్ సైట్లలో భారీగా ప్రచారం జరిగింది. అయితే ఇది అంతా ఫేక్ అని తేలిపోయింది. ప్రమాదం లేదు..గాయాలు లేవు. అయితే ఈ ప్రచారంతో అభిమానులు ఆందోళనతో నిజాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు చేశారు. రాజమౌళి సినిమా ఫోటోషూట్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే అమెరికా పర్యటన సమయంలోనే ప్రమాదం జరిగినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై ఎన్టీఆర్ పీఆర్‌, నిర్మాత మహేష్‌ కోనేరు స్పందించారు. ఓ అభిమాని ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టుగా ఓ వెబ్‌సైట్‌ ఉన్న వార్తపై క్లారిటీ కోరగా.. అవన్నీ రూమర్స్‌, ఎన్టీఆర్‌ బాగున్నారు.. షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు అంటూ స్పందించారు. త్వరలో త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. ఈ క్లారిటీలో అభిమానుల్లో ఆందోళన తొలగిపోయింది.

Next Story
Share it