Telugu Gateway
Cinema

తమన్నా ‘కష్టాలు’

తమన్నా ‘కష్టాలు’
X

టాప్ హీరోయిన్ అయితే చాలు. స్టార్ స్టేటస్..స్టార్ సౌకర్యాలు. జీవితం అంతా వెలుగు జిలుగులే అనే భావన అందరిలో ఉంటుంది. వెండితెర మీద వెలుగులే నిజ జీవితంలోనూ ఉంటాయనుకుంటారు. కాకపోతే వాస్తవంగా అలా ఉండదా?. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం ఔననే అంటోంది. బయట అందరూ అనుకున్నట్లుగా హీరోయిన్లకు అంత హ్యాపీ లైఫ్ ఏమీ ఉండదనే చెబుతోంది ఈ భామ. పగలు..రాత్రిళ్ళూ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. షూటింగ్‌ స్పాట్‌లో షాట్‌ రెడీ అని పిలవగానే వెళ్లి నిలబడాలి. మనసులో ఎలాంటి కష్టనష్టాలున్నా, అవి బయట పడకుండా నటించాలి. సొంత పనులకు కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి. కాసేపు కుటుంబంతో కలిసి గడపాలని ఆశించినా కుదరదు. ఇష్టమైన ఆహారాన్ని కూడా తినలేం. అందాన్ని కాపాడుకోవడానికి కసరత్తులు చేయాలి. శరీర సౌష్టవాన్ని నాజూగ్గా ఉంచుకోవడానికి తగిన కసరత్తులు చేయాలి.

సాధారణ అమ్మాయిలను చూసినప్పుడు నేను వారిలా స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాననే బాధ కలుగుతుంది. అయితే సినిమాలో సంతోషమే లేదని చెప్పను, మేము చాలా త్యాగాలు చేస్తున్నామన్నది ఇతరులు గ్రహించాలి. సినిమాల్లో కొనసాగడానికి, అవకాశాల కోసం పరితపించాల్సి ఉంటుంది. ఇక్కడ దర్శకుడే కెప్టెన్‌. వాళ్లు చెప్పినట్లు నటించాల్సిందే అని అంటోంది నటి తమన్నా. హీరోయిన్లకు సుఖాలే కాదు..కష్టాలు కూడా ఉంటాయి అంటోంది ఈ మిల్కీ బ్యూటీ.

Next Story
Share it